Leading News Portal in Telugu

Ponnam Prabhakar: ఆరు గ్యారెంటీలే మా ఆయుధాలు.. పొన్నం ప్రభాకర్


Ponnam Prabhakar: ఆరు గ్యారెంటీలే మా ఆయుధాలు.. పొన్నం ప్రభాకర్

Ponnam Prabhakar: నేడు విజయ దశమి సందర్భంగా కరీంనగర్ మాజీ పార్లమెంట్ సభ్యులు పొన్నం ప్రభాకర్ హుస్నాబాద్ నియోజకవర్గంలోని తన నివాసంలో జమ్మిపూజ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ ప్రజలందరికీ దుర్గామాత ఆశీస్సులతో విజయం కలగాలని ఆశిస్తూ, హుస్నాబాద్ లో మార్పు కోరుకుంటున్న నియోజకవర్గ ప్రజలకు విజయం కలగాలనే వారందరి ఆకాంక్షలు నెరవేరాలని తెలిపారు. చెడుపై మంచి సాధించిన విజయమే విజయదశమి అయినందున, రాష్ట్ర ప్రజలందరూ కోరుకునే మార్పులో విజయం వరించాలని అమ్మవారిని వేడుకుంటూ, ఈ విజయదశమి రోజు ఇక్కడ జరుపుకున్న జమ్మి పూజ కార్యక్రమంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీలే మా ఆయుధంగా చేస్తున్న పోరాటంలో ప్రజలందరూ మమ్మల్ని ఆశీర్వదించి ఆదరిస్తారని అన్నారు.

మాకు సంపూర్ణ విజయం కలిగిస్తారని మా ఆయుధమే.. మా ఆరు గ్యారంటీలు, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట ప్రకారం ఆరు గ్యారెంటీల హామీలను అమలు చేస్తుందన్నారు. అన్ని వర్గాల ప్రజలను అన్ని రంగాలలోని శ్రామిక న్యాయం చేస్తుందని తెలిపారు. ఈ మేరకు గ్యారంటీ కార్డులు రాని ప్రజలు స్థానిక కాంగ్రెస్ పార్టీ మీద ఆశ్రయించి గ్యారెంటీ కార్డులు పొందాలని విజ్ఞప్తి చేస్తున్నాం అని అన్నారు.
Top Headlines @1PM: టాప్‌ న్యూస్‌