Leading News Portal in Telugu

Raja Gopal Reddy: కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారా..? రాజగోపాల్ రెడ్డి ఏమన్నారంటే..!


Raja Gopal Reddy: కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారా..? రాజగోపాల్ రెడ్డి ఏమన్నారంటే..!

Raja Gopal Reddy: కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రస్తుతం బీజేపీలో ఉన్నారు.. త్వరలో కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారా..? ఇదే ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.. బీజేపీకి గుడ్ బై చెబుతారని సోషల్ మీడియా, కొన్ని ఛానెల్స్ ద్వారా ప్రచారం సాగుతోంది. ఉప ఎన్నికల్లో ఓటమి తర్వాత.. బీజేపీలో యాక్టివ్‌గా లేని రాజగోపాల్.. 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు.. బీజేపీని వీడి.. కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. మీడియా ప్రచారాన్ని ఆయన ఖండించలేదు. దీంతో ఇది నిజమేనా అనే మాటలు వినిపిస్తున్నాయి. అక్టోబర్ 24న రాహుల్ గాంధీ సమక్షంలో రాజగోపాల్ కాంగ్రెస్‌లో చేరే అవకాశం ఉంది. రాజగోపాల్ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తారని సమాచారం. ఇదే విషయమై ఆయన తన అనుచరులు, ముఖ్య కార్యకర్తలతో చర్చిస్తున్నారు.

పార్టీ మార్పుపై రాజగోపాల్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ముందుగా తెలంగాణ ప్రజలకు విజయ దశమి శుభాకాంక్షలు రాజగోపాల్ రెడ్డి తెలిపారు. ఈ దసరాతోనే కేసీఆర్ రాక్షస పాలనకి స్వస్తి పలుకుదామన్నారు. తెలంగాణ ప్రజల ఆలోచనకి అనుగుణంగానే నా భవిష్యత్ నిర్ణయం ఉంటుందన్నారు. కేసీఆర్ కుటుంబ దుర్మార్గ పాలన విముక్తి కోసమే నా పోరాటమన్నారు. మునుగోడు కార్యకర్తలు.. నాయకులు.. ప్రజల ఆలోచనకు అనుగుణంగా నిర్ణయం తీసుకుంటామన్నారు. నాపై ఎంత దుష్ప్రచారం చేసినా కేసీఆర్ పై పోరాటం ఆపలేదని, ఇకపై అపబోనని అన్నారు. తాను ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదన్నారు. కాంగ్రెస్ నుంచి పోటీ చేయాలని గతంలో ప్రజలు ఒత్తిడి తెచ్చారని అన్నారు. ఇప్పటికైనా ఉప ఎన్నికల పరిస్థితులు మారాయన్నారు.

మరోవైపు బీజేపీ ప్రకటించిన 52 మంది తొలి జాబితాలో రాజగోపాల్ పేరు లేదు. దీంతో రాజగోపాల్ పార్టీ మారతారనే ప్రచారం జోరందుకుంది. గతంలో జరిగిన ఉప ఎన్నికల్లో రాజగోపాల్ రెడ్డి బీఆర్‌ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి చేతిలో ఓడిపోయారు. అప్పటి నుంచి పార్టీ కార్యక్రమాల్లో అంటీముట్టనట్టు ఉంటున్నారు. దీంతో ఆయన పార్టీ మారతారనే ప్రచారం సాగుతోంది.
Ram Charan: రామ్ చరణ్‌ కూతురిని చూశారా?.. వైరల్ అవుతున్న ఫోటో..