Leading News Portal in Telugu

Telangana Weather: పగలేమో ఎండ.. రాత్రేమో వణికిస్తోన్న చలి


Telangana Weather: పగలేమో ఎండ.. రాత్రేమో వణికిస్తోన్న చలి

Telangana Weather: తెలంగాణలో గత కొన్ని రోజులుగా భిన్నమైన వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. పగటిపూట తీవ్రమైన ఎండలు, వేడిగాలులు ప్రజలను ఇబ్బంది పెడుతున్నాయి. రాత్రి అయితే చాలు. ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. ఉదయం చల్లదనం పెరుగుతోంది. సోమవారం (అక్టోబర్ 23) రాత్రి… హనుమకొండలో 16 డిగ్రీల సెల్సియస్ నమోదైంది. తెలంగాణలోని పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు దారుణంగా పడిపోతున్నాయి.

ఉత్తరాది నుంచి రాష్ట్రం వైపు గాలులు వీస్తుండటంతో వాతావరణంలో మార్పులు చోటుచేసుకున్నట్లు వాతావరణ శాఖ అధికారులు వెల్లడిస్తున్నారు. హైదరాబాద్‌లో సాధారణం కంటే 1.7 డిగ్రీలు తగ్గింది. రాజేంద్రనగర్, పటాన్చెరులోనూ ఉష్ణోగ్రతలు పడిపోయాయి. ఆదిలాబాద్, కరీంనగర్, ఖమ్మంలో కూడా ఉష్ణోగ్రతలు పడిపోయాయి. ఇక మంగళవారం (అక్టోబర్ 24) పలు ప్రాంతాల్లో పగటి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా నమోదయ్యాయి. ఖమ్మంలో సాధారణం కంటే 3.8 డిగ్రీలు అధికంగా 35.6 డిగ్రీలు నమోదైంది. భద్రాచలంలో 1.7 డిగ్రీలు, హైదరాబాద్‌లో 1.3 డిగ్రీలు నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు.

అయితే, మొన్నటి వరకు పగటిపూట ఎండలు మండిపోయాయి.. కానీ, రాత్రిళ్లు మాత్రం చల్లని వాతావరణం కనబడుతుంది. ఇప్పుడు మళ్లీ ఉష్ణోగ్రతలు తగ్గిపోతుండటంతో పాటు వాయుగుండం ప్రభావంతో వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణశాఖ వెల్లడించింది. తెలంగాణపైనా ఈ తుపాన్ ప్రభావం ఉంటుందని అంచనా.. తేలికపాటి నుంచి మోస్తరు వర్షం కురుస్తుందని ఐఎండీ తెలిపింది. అయితే వాయుగుండం తుపాన్‌గా మారి బంగ్లాదేశ్ వైపు వెళ్లి తీరం దాటుతుంది.. మరి వాయుగుండం ప్రభావం తెలంగాణపై ఎలా ఉంటుంది అన్నదే వేచి చూడాలి..
Katrina Kaif: చీరకట్టులో మైమరిపిస్తున్న కత్రినా అందాలు…