Leading News Portal in Telugu

Video: లైవ్‌ డిబేట్‌లో కొట్టుకున్న ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే


Video: లైవ్‌ డిబేట్‌లో కొట్టుకున్న ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే

Video: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో అధికార ప్రతిపక్ష నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. తాజాగా కుత్బుల్లాపూర్‌లో నిర్వహించిన లైవ్‌ డిబేట్‌లో మాటల యుద్ధం కాస్తా ఘర్షణకు దారి తీసింది. లైవ్‌ డిబేట్‌ సందర్భంగా కుత్బుల్లాపూర్‌ ఎమ్మెల్యే కేపీ వివేకానంద, బీజేపీ అభ్యర్థి కూన శ్రీశైలం గౌడ్‌ల మధ్య మాటల యుద్ధం జరిగింది. వాగ్వాదం కాస్తా ఘర్షణకు దారి తీసింది.

ఈ క్రమంలో సహనం కోల్పోయిన ఎమ్మెల్యే వివేకానంద శ్రీశైలం గౌడ్‌ గొంతును పట్టుకున్నారు. ఈ క్రమంలో పోలీసులు వారిద్దరిని అడ్డుకున్నారు. నాయకుల మధ్య ఘర్షణ చోటుచేసుకోవడంతో ఇరు పార్టీల కార్యకర్తలు కూడా హంగామా చేశారు. వారిని కూడా పోలీసులు నిలువరించారు.