
Janareddy: కాంగ్రెస్ పార్టీని విమర్శించేస్థాయి కేటీఆర్, హరీష్, కవితలకు లేదని కాంగ్రెస్ సీనియర్ నేత కుందూరు జానారెడ్డి పేర్కొన్నారు. యాదాద్రి జిల్లా భువనగిరి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశానికి ముఖ్యఅతిథిగా జానారెడ్డి హాజరయ్యారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఏకకాలంలో రుణమాఫీ చేసిన ఘనత కాంగ్రెస్‌దని ఆయన తెలిపారు. వ్యవసాయానికి ఉచిత కరెంట్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టేనని జానారెడ్డి వెల్లడించారు.
ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 3 లక్షల మంది లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్లు నిర్మాణం చేసిన ఘనత కాంగ్రెస్‌దంటూ ఆయన వ్యాఖ్యానించారు. ఆరోగ్యశ్రీ పథకం తెచ్చింది కాంగ్రెస్సేనని.. మా పదవులను త్యాగాలు చేసి తెలంగాణా రాష్ట్రాన్ని ప్రకటన చేసింది కూడా కాంగ్రెస్సే అంటూ జానారెడ్డి స్పష్టం చేశారు. ఒక్క రూపాయి కిలో బియ్యం ఇచ్చింది కూడా హస్తం పార్టేనని ఆయన చెప్పారు. రాబోయే రోజులో ప్రజలకు సరైనా న్యాయం చేసిందుకు ఆరు గ్యారంటీలను ప్రజలకు భరోసా కల్పించే విధంగా సోనియాగాంధీ చేతుల మీదుగా ఇవ్వటం జరిగిందన్నారు. చేతి గుర్తుపై ఓటేసి కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించి… మీకు సేవ చేసే అవకాశం కలిపించాలని ప్రజలకు ఆయన విజ్ఞప్తి చేశారు