Leading News Portal in Telugu

Extortion of money: పోలీసుల ముసుగులో డ్యూటీ.. 18లక్షలు లూటీ


Extortion of money: పోలీసుల ముసుగులో డ్యూటీ.. 18లక్షలు లూటీ

Hyderabad: దోపిడీ చేస్తూ పట్టుబడితే పోలీసులకి అప్పగిస్తారు. ఆపై అధికారులు శిక్షిస్తారు. అదే పోలీసు యూనిఫామ్ ఉంటే ఏం చేసిన అడిగే వారు ఎవరు ఉండరు. డ్యూటీ పేరుతో లూటీ చేసిన ఎవరికీ అనుమానం రాదు అనుకుని.. యూనిఫామ్ ముసుగులో ఏం చేసిన చెల్లుతుంది అని పొరపాటు పడిన ఇద్దరు వ్యక్తులు పోలీసుల అవతారం దాల్చారు. డ్యూటీకి దిగి లూటీకి పాల్పడ్డారు. చెకింగ్ పేరుతో ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 18 లక్షలను మాయం చేశారు ఈ నకిలీ పోలీసుల. ఈ ఘటన పంజాగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో వెలుగు చూసింది. వివరాలలోకి వెళ్తే.. ప్రదీప్, శంకర్ అనే ఇద్దరు వ్యక్తులు కారులో ప్రయాణిస్తుండగా పోలీసు డ్రెస్ లో ఉన్న ఇద్దరు వ్యక్తులు పంజాగుట్ట పరిధిలో కారును అడ్డుకున్నారు.

Read also:Vikarabad Crime: వికారాబాద్ జిల్లాలో విషాదం.. కన్నతల్లిని కడతేర్చిన కొడుకు..

చెకింగ్ పేరుతో కారును తనిఖీ చెయ్యగా అందులో రూ/20 లక్షలు దొరికాయి. చెకింగ్ లో భాగంగా ఆ ఇద్దరు నకిలీ పోలీసులు 18 లక్షలు తీసుకున్నారు. దీనితో కార్ లో డబ్బులు తీసుకెళ్తున్న శంకర్, ప్రదీప్ జరిగిన విషయాన్ని వాళ్ళ ఓనర్ కి తెలియ చేసారు. అనంతరం బాధితులు పోలీసులను ఆశ్రయించారు. కాగా భాదితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలో నిందితులు దొంగిలించిన రూ/18 లక్షలు సంతోష్ నగర్, ఐఎస్ సదన్, చంపాపేట మీదుగా వెళ్తున్న క్రమంలో పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకుని.. విచారణ చేస్తున్నట్లు సమాచారం.