Leading News Portal in Telugu

Manda Krishna Madiga: ఎస్సీ వర్గీకరణకు ఏ పార్టీ మద్దతు ఇస్తే ఆ పార్టీకే మద్దతు..


Manda Krishna Madiga: ఎస్సీ వర్గీకరణకు ఏ పార్టీ మద్దతు ఇస్తే ఆ పార్టీకే మద్దతు..

Manda Krishna Madiga: ఎస్సీ వర్గీకరణకు ఏ పార్టీ మద్దతు ఇస్తే ఆ పార్టీకే మా మద్దతు పలుకుతామని ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ వెల్లడించారు. సిద్దిపేట జిల్లాలోని గజ్వేల్‌లో మాదిగల విశ్వరూప మహా సభలో మంద కృష్ణ మాదిగ పాల్గొన్నారు. నవంబర్ 18 తేదీన హైదరాబాద్‌లోని పరేడ్ గ్రౌండ్‌లో లక్షల మందితో మాదిగల విశ్వరూప మహా సభ ఏర్పాటు చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు. ఈ మహాసభకు ముఖ్యఅతిథిగా దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీని ఆహ్వానిస్తున్నామన్నారు. షెడ్యూల్ కులాల వర్గీకరణ జరిగినప్పుడే వారు పిల్లల చదువులు బాగుపడతాయని, చదువుకున్నవారికి ఉద్యోగాలు వస్తాయని మందకృష్ణ మాదిక తెలిపారు.

ఎస్సీ వర్గీకరణ జరిగితే తరాలకు రాబోయే వందల సంవత్సరాలకు మంచి జరుగుతుందన్నారు. ఎస్సీ వర్గీకరణపై రాజకీయ పార్టీల వైఖరి వెల్లడించాలని ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ డిమాండ్ చేశారు. సమస్య పరిష్కారానికి చొరవ తీసుకునే పార్టీకే మాదిగల మద్దతు ఉంటుందన్నారు. కేసీఆర్ మాదిగలకు అన్యాయం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. మాకు అన్యాయం చేసిన పార్టీలను మాదిగ పల్లెల్లోకి రాకుండా చేస్తామని మంద కృష్ణ మాదిగ పేర్కొన్నారు.