Leading News Portal in Telugu

Bhatti Vikramarka: ఈసారి రాబోయేది ప్రజాప్రభుత్వం.. ప్రజలందరి సంక్షేమ ప్రభుత్వం


Bhatti Vikramarka: ఈసారి రాబోయేది ప్రజాప్రభుత్వం.. ప్రజలందరి సంక్షేమ ప్రభుత్వం

Bhatti Vikramarka: కార్యకర్తలే తన బలమని.. మధిర నియోజకవర్గ ప్రజలే తన ఊపిరి అని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. వారి ఆకాంక్షలను నెరవేర్చడమే తన ఆశయమని ఆయన వెల్లడించారు. ఖమ్మంలో కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ ఆధ్వర్యంలో నిర్వహించబడిన “న్యాయవాదుల ఆత్మీయ సమావేశం”లో సహచర కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి పాల్గొన్న మధిర నియోజకవర్గ శాసనసభ్యులు, మధిర నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మల్లు భట్టి విక్రమార్క పాల్గొన్నారు.

మధిర నియోజకవర్గ సమగ్రాభివృద్దే తన ధ్యేయమని భట్టి పేర్కొన్నారు. మధిర నియోజకవర్గ ప్రజానీకానికి, వారి సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేశా.. చేస్తూనే ఉంటానని వ్యాఖ్యానించారు. ఈసారి రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం, ప్రజలందరి సంక్షేమ ప్రభుత్వమని ఆయన ధీమా వ్యక్తం చేశారు భట్టివిక్రమార్క. ఆశీర్వదించండి.. అండగా ఉంటా… అభివృద్ధి చేస్తా… ప్రత్యేక తెలంగాణమ్మ ఫలాలను సబ్బండ వర్గాలందరికీ అందజేస్తానని భట్టి విక్రమార్క ప్రజలకు హామీ ఇచ్చారు.

అధికారంలో ఉన్న దొరల తెలంగాణ, ప్రజల తెలంగాణ మధ్య యుద్ధం నడుస్తుందన్నారు భట్టి విక్రమార్క. యుద్ధంలో ప్రజలు గెలవాలని రాహుల్ గాంధీ కోరుకున్నారని ఆయన అన్నారు. కాంగ్రెస్ గెలిస్తే ప్రజలు గెలిచినట్లు అని ఆయన ప్రకటించారు. “ప్రజలు కలలు కన్న తెలంగాణ రాకుండా పోయింది.. తెలంగాణ వచ్చిన సమస్యలు పరిష్కారం కాలేదు.. భయం భయంగా బ్రతుకల్సిన పరిస్థితి రాష్ట్రంలో నెలకొంది.. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే.. ప్రజలకు న్యాయం జరుగుతుంది.. ఖమ్మంలో ఏమి మాట్లాడాలన్న భయంగా ఉంది.. రాష్ట్ర కాంగ్రెస్ ఏర్పడడానికి ఖమ్మం నుంచే ప్రారంభం కావాలి.. ఖమ్మం కాంగ్రెస్ గెలుపునకు పునాది కావాలి” అని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క తెలిపారు.