Leading News Portal in Telugu

Jagadish Reddy : ఓటు వేసే ప్రతి ఒక్కరికీ కేసీఆర్ పథకాలు గుర్తుకురావాలి


Jagadish Reddy : ఓటు వేసే ప్రతి ఒక్కరికీ కేసీఆర్ పథకాలు గుర్తుకురావాలి

నాలుగేళ్ల నుండి కరోనా కష్ట కాలంలో కనపడని ఇతర పార్టీల నాయకులు ఇప్పుడు కండువాలు వేసుకుని కనబడుతున్నారన్నారు మంత్రి జగదీశ్ రెడ్డి. ఇవాళ ఆయన నల్గొండలో మీడియాతో మాట్లాడుతూ.. కర్ణాటక కాంగ్రెస్ ను నమ్మి అక్కడి ప్రజలు ఓటేస్తే రైతులకు రెండు గంటలకు కూడా కరెంట్ ఇవ్వడం లేదన్నారు. ఓటు వేసే ప్రతి ఒక్కరికీ కేసిఆర్ పథకాలు గుర్తుకురావాలని, కేసీఆర్ మరోసారి సీఎం అయిన వెంటనే 93 లక్షల పేద కుటుంబాలకు 5 లక్షల భీమా, పేదలు ఆత్మగౌరవంగా బతికేందుకు సన్న బియ్యం ఇస్తామన్నారు జగదీష్‌ రెడ్డి. కాంగ్రెస్ కు అధికారం ఇస్తే దొంగల చేతికి తాళాలు ఇచ్చినట్టే, రాష్ట్రం అందకారం అవుతుందని, రవీంద్ర కుమార్ బ్యాంకు దోపిడీలు, కాంట్రాక్టులు చేయాలేదు ..అభివృద్ది కోసమే పాటుపడిందన్నారు.

కాంగ్రెస్ , బీజేపీల అజెండా ఒక్కటేనని.. కాంగ్రెస్ బీజేపీ మ్యాచ్ ఫిక్సింగ్ రాజకీయాలను ప్రజలు గమనించాలన్నారు. కాంగ్రెస్ , బీజేపీలు పోటీచేసే అభ్యర్ధులను ఇచ్చిపుచ్చుకుంటున్నాయన్నారు. బీఆర్ఎస్ పార్టీని ఎదగనీయకుండా చేయాలని కాంగ్రెస్ , బీజేపీలు కుట్ర చేస్తున్నాయన్నారు. ప్రజల కోసం పని చేసే పార్టీని గుర్తించి.. గెలిపించాలని కోరారు. బీజేపీకి రెండు సార్లు అధికారం ఇస్తే దేశాన్ని ఆకలి రాజ్యంగా మార్చిందని.. బీజేపీ పాలనలో పెనం నుండి పొయ్యిలో పడ్డ చెందంగా దేశం పరిస్థితి తయారైందన్నారు జగదీష్‌ రెడ్డి.