Leading News Portal in Telugu

Hyderabad: చంపాపేట్ స్వప్న హత్య కేసులో వీడిన మిస్టరీ.. హంతకుడు ఎవరంటే..?


Hyderabad: చంపాపేట్ స్వప్న హత్య కేసులో వీడిన మిస్టరీ.. హంతకుడు ఎవరంటే..?

breaking news: ఐఎస్ సదన్ పోలీస్ స్టేషన్ పరిధి లోని చంపాపేట్ లోని రాజీ రెడ్డి నగర్ లో మిస్టరీగా మారిన యువతి హత్య కేసు వివిధ ట్విష్టుల అనంతరం మిస్టరీని చేధించారు పోలీసులు. వివరాలలోకి వెళ్తే.. నిన్న ఉదయం 11:30 గంటలకు చంపాపేట్ లోని రాజీ రెడ్డి నగర్ లో స్వప్న అనే యువతి ఇంట్లోనే హత్య చేయబడింది. కాగా ఆమె భర్త ప్రేమ్ రెండవ అంతస్థు పైన నుండి కింద పడగా అతన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. కాగా తీవ్ర గాయాలు కావడం చేత అతను కోమాలోకి వెళ్ళాడు. అయితే స్వప్న తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలో సిసి కెమెరా ను పరిశీలించిన పోలీసులు వివాహేతర సంబంధం కారణంగా స్వప్న ప్రియుడు ఆమెను హత్య చేసి.. ఆమె భర్తను పైన నుండి కిందకి నెట్టేసినట్లు అనుమానించారు.

Read also:Jawan : ఓటీటీ లోకి రాబోతున్న షారుఖ్ సూపర్ హిట్ మూవీ..

కాగా తాజాగా కోమాలో నుండి బయటకు వచ్చిన స్వప్న భర్త ప్రేమ్ జరిగిన విషయం పోలీసులకు తెలియ చేయగా పోలీసులు ప్రేమ్ ఇచ్చిన స్టేట్ మెంట్ రికార్డ్ చేసుకున్నారు. ప్రేమ్ పోలీసులకు ఇచ్చిన స్టేట్ మెంట్ సమాచారం ప్రకారం.. ప్రేమ్ ఇంటికి వచ్చేసరికి స్వప్న తన మాజీ ప్రియుడు సతీష్ తో ఇంట్లో ఉన్నది. ఈ నేపథ్యంలో ప్రేమ్ కి సతీష్ కి మధ్య గొడవ జరిగింది.
ఈ క్రమంలో ఆగ్రహానికి లోనైన ప్రేమ్ ఇంట్లో ఉన్న కత్తితో స్వప్నను హత్య చేసాడు. దీనితో సతీష్ ప్రేమ్ పైన దాడి చేసి ప్రేమ్ ను పైన నుండి కిందకి తోసేసాడు. అనంతరం అక్కడ నుండి పారిపోయాడు. కాగా ప్రస్తుతం పరారీలో ఉన్న సతీష్ కోసం పోలీసులు గాలిస్తున్నారు.