Leading News Portal in Telugu

CM KCR : దేశంలోనే పెద్ద నగరాలను తలదన్ని హైదరాబాద్ నంబర్ వన్ స్థానంలో ఉంది


CM KCR : దేశంలోనే పెద్ద నగరాలను తలదన్ని హైదరాబాద్ నంబర్ వన్ స్థానంలో ఉంది

బీఆర్‌ఎస్‌ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్‌ ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు. రోజుకు మూడు నియోజకవర్గాల్లో బహిరంగ సభల్లో పాల్గొని హామీలు వెల్లడిస్తున్నారు. ఈ నేపథ్యంలో నేడు నల్లగొండ జిల్లా మిర్యాలగూడ ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. రైతు బంధు డబ్బులు దుబారా అంటున్నారు ఉత్తమ్ కుమార్ రెడ్డి అని, 3 గంటల విద్యుత్ చాలు అని పీసీసీ అధ్యక్షుడు అంటున్నారన్నారు. అది కాంగ్రెస్ పార్టీ దృక్పదం, వైఖరి అని ఆయన విమర్శించారు. దళిత భందు నిరంతర ప్రక్రియ అని కేసీఆర్‌ వెల్లడించారు. 30వేల కోట్ల రూపాయలతో థర్మల్ పవర్ ప్లాంట్ నిర్మాణం జరుగుతుందని, దేశంలోనే పెద్ద నగరాలను తలదన్ని హైదరాబాద్ నంబర్ వన్ స్థానంలో ఉందన్నారు సీఎం కేసీఆర్‌. రాష్ట్రంలో శాంతి భద్రల అదుపులో ఉన్నాయని, శాంతి భద్రతల విషయంలో రాజీపడమన్నారు. కాంగ్రెస్ పార్టీ శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తుందని, దుబ్బాకలో BRS అభ్యర్ధి పై కాంగ్రెస్ పార్టీ దాడులకు పాల్పడిందన్నారు.

భాస్క‌ర్ రావు చాలా హుషారు ఉన్నారు. హుషారు ఉన్నార‌ని తెలుసు కానీ ఇంత హుషారు ఉన్నార‌ని తెల్వ‌దు అని కేసీఆర్ పేర్కొన్నారు. ఏం చేసినా న్యాయంగా, ఇమాందారీగా చేయ‌డం ఆయ‌న‌కు అల‌వాటు. నాయ‌కులు చాలా మంది ఉంటారు. ఎమ్మెల్యేలు చాలా మంది అయ్యారు. కానీ భాస్క‌ర్ రావు ఎలాంటి వారంటే ఇన్నేండ్ల‌లో ఏ ఒక్క రోజూ కూడా వ్య‌క్తిగ‌త‌మైన ప‌నులు అడ‌లేదు. మిర్యాల‌గూడ ప‌ట్ట‌ణాభివృద్ధి, తండాల అభివృద్ధి, మంచి, సాగునీటి స‌మ‌స్య‌ల ప‌రిష్కారం కోసం, పారిశ్రామిక వాడ కోసం ప‌ట్టుబ‌ట్టారు అని కేసీఆర్ తెలిపారు.