Leading News Portal in Telugu

Mynampally Hanumantha Rao : మైనంపల్లి హనుమంతరావు అధికార దుర్వినియోగం.. లోకాయుక్తలో ఫిర్యాదు


Mynampally Hanumantha Rao : మైనంపల్లి హనుమంతరావు అధికార దుర్వినియోగం.. లోకాయుక్తలో ఫిర్యాదు

మైనంపల్లి హనుమంతరావు అధికార దుర్వినియోగం, అవినీతికి పాల్పడ్డాడని లోకాయుక్త లో ఓ న్యాయవాది ఫిర్యాదు చేశారు. మైనంపల్లి హనుమంత్ రావు, మైనంపల్లి వాణి, మైనంపల్లి రోహిత్ పై తెలంగాణ లోకాయుక్తకి సీనియర్ న్యాయవాది రామా రావు ఇమ్మానేని ఫిర్యాదు చేశారు. మైనంపల్లి అధికార దుర్వినియోగానికి పాల్పడి కోట్ల రూపాయల అవినీతి సొమ్ము కూడపెట్టినట్లు ఆయన ఆరోపించారు. తన కుటుంబ సభ్యులకు కోట్ల రూపాయల విదేశీ కార్లు, అరబ్బు గుర్రాలు, ఖరీదైన విలాస వస్తువులను బహుమతులుగా ఇచ్చాడని, 2017 ఎన్నికల అఫిడవిట్ లో తన ఆస్తి విలువ మూడున్నర కోట్లుగా, మైనంపల్లి వాణి గారి ఆస్తి సుమారు యాభై లక్షలుగా చూపించాడని తెలిపారు.

రోహిత్ ఎటువంటి ప్రాక్టీస్ చేయకుండా 2020 లో డాక్టర్ పట్టా పొందాడని ఆయన వెల్లడించారు. సుమారు ఇరవై కోట్ల విలువైన పద్దెనిమిది విదేశీ కార్లు అవినీతి సొమ్ము తో కొనుగోలు చేసారని, కేవలం కార్లే కాదు, కోట్ల రూపాయల విలువ చేసే అరబ్ గుర్రాలు, విదేశీ పెంపుడు కుక్కలు, సొంత విమానాలు, విలాసవస్తువులు రోహిత్ స్వంతమని, ప్రజాప్రతినిధి అయిన మైనంపల్లి కుటుంబానికి చెందిన వేల కోట్ల ఆస్తులపై విచారణ చేపట్టవలసిందిగ ఆదేశాలు ఇవ్వవలసిందిగా లోకాయుక్తను రామారావు కోరారు.