Leading News Portal in Telugu

BIG Breaking: బీజేపీకి బిగ్‌ షాక్‌.. పార్టీకి వివేక్‌ గుడ్‌ బై



Vivek Venkat Swami

BIG Breaking: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు రోజురోజుకు రసవత్తరంగా మారుతున్నాయి. పార్టీలు ప్రకటించే అభ్యర్థుల జాబితాపై ఆయా పార్టీల్లో అంతర్గత వివాదం నెలకొంది. టికెట్ రాని నేతలు మీడియా ముందు, అనుచరుల ముందు రోదిస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఓ వైపు సీనియర్ నేతలు అసంతృప్త నేతలను బుజ్జగిస్తూనే మరోవైపు పలు పార్టీలు ఇతర పార్టీల్లో టికెట్లు రాని నేతలను తమ పార్టీలోకి ఆహ్వానిస్తున్నాయి. ఈనేపథ్యంలో బీజేపీకి వివేక్ వెంకటస్వామి షాక్ ఇచ్చారు. బీజేపీకి పార్టీకి మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి బీజేపీకి రాజీనామా చేశారు. ఈ విషయంపై వివేక్ క్లారిటీ ఇచ్చారు. రాజీనామా చేస్తున్నట్లు కేంద్రమంత్రికి కిషన్ రెడ్డికి లేఖ రాశారు. బాధతో బీజేపీ పార్టీని వీడుతన్నట్లు ఆయన లేఖలో ప్రస్తావించారు. వివేక్ వెంకట స్వామి, ఆయన కుమారుడు వంశీ త్వరలో రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. శంషాబాద్‌లోని నోవాటెల్‌లో రాహుల్ గాంధీతో వివేక్, వంశీ భేటీ కానున్నారు. ఇటీవల వివేక్ రేవంత్ రెడ్డిని కలిసి చెన్నూరు నుంచి పోటీ చేయాలని కోరగా, పెద్దపల్లి నుంచి ఎంపీగా పోటీ చేస్తానని వివేక్ క్లారిటీ ఇచ్చారు. అలాగే వివేక్ కుమారుడిని చెన్నూరు నుంచి పోటీకి దింపాలని కాంగ్రెస్ హైకమాండ్ భావిస్తోంది.

బీజేపీ మేనిఫెస్టో కమిటీ చైర్మన్‌గా వివేక్ వెంకటస్వామి కొనసాగుతున్నారు. గత కొంత కాలంగా బీజేపీలో జరుగుతున్న పరిణామాలపై వివేక్ వెంకటస్వామి అసంతృప్తితో ఉన్నారని ప్రచారం జరుగుతోంది. మరికొందరు బీజేపీ నేతలు కాంగ్రెస్‌లో చేరే అవకాశం కూడా ఉంది. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డితో పాటు వివేక్ వెంకటస్వామి కూడా కాంగ్రెస్‌లో చేరే అవకాశం ఉంది. అయితే ఈ ప్రచారాన్ని వివేక్ వెంకటస్వామి గత నెల 24న ఖండించారు. తాను పెద్దపల్లి పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేస్తానని ప్రకటించారు. వివేక్ వెంకటస్వామి కాంగ్రెస్ లో చేరి చాలా కాలమని గుర్తు చేశారు. 2009లో కాంగ్రెస్ ఎంపీగా గెలిచిన వివేక్ వెంకటస్వామి.. ఆ తర్వాత కాంగ్రెస్ ను వీడి బీఆర్ ఎస్ లో చేరారు. కొంతకాలం బీఆర్‌ఎస్‌లో కొనసాగారు. వివేక్ వెంకటస్వామి బీఆర్‌ఎస్‌ను వీడి బీజేపీలో చేరారు. కొందరు కాంగ్రెస్ నేతలు బీజేపీలో చేరారు. తెలంగాణలో బీఆర్‌ఎస్‌ను గద్దె దించే సత్తా బీజేపీకి ఉందని అప్పట్లో ఆ నేతలు చెప్పారు. కొండా విశ్వేశ్వర్ రెడ్డి, విజయశాంతి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాషాయ పార్టీలో చేరారు.

ఈటల రాజేందర్ బీజేపీలో చేరిన తర్వాత బీజేపీలో అనేక పరిణామాలు చోటు చేసుకున్నాయి. బండి సంజయ్‌ను తప్పించాలని కొందరు పార్టీ నేతలు పార్టీ అధిష్టానానికి ఫిర్యాదు చేశారు. కొందరు బండి సంజయ్‌కు అనుకూలంగా వ్యవహరించారు. ఈ పరిణామాల నేపథ్యంలో పార్టీ జాతీయ నాయకత్వం బండి సంజయ్‌ను పార్టీ అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పించింది. ఈ పరిణామంపై కొందరు నేతలు అసంతృప్తి వ్యక్తం చేశారు. బండి సంజయ్‌ను పార్టీ బాధ్యతల నుంచి తప్పించడం వల్ల పార్టీకి ఇబ్బందికర పరిస్థితి ఏర్పడిందన్న అభిప్రాయంతో నేతలు కూడా ఉన్నారు. ఈ పరిణామాలతో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీకి రాజీనామా చేశారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తర్వాత వివేక్ వెంకటస్వామి బీజేపీకి గుడ్ బై చెప్పారు. అయితే.. సరిగ్గా ఎన్నికల వేళ కీలక నేత పార్టీకి హ్యాండ్ ఇవ్వడం బీజేపీ పార్టీకి మరింత నష్టం చేకూరుస్తుందని టాక్‌.
Dhootha : నాగ చైతన్య దూత వెబ్ సిరీస్ రిలీజ్ డేట్ ఫిక్స్..