
TS Elections: తెలంగాణలో తొలిసారిగా జనసేన తన బలాన్ని పరీక్షించుకోనుంది. బీజేపీ మూడో జాబితాపై కసరత్తు తుది దశకు చేరుకుంది. తెలంగాణలో బీజేపీ, జనసేన మధ్య సీట్ల సర్దుబాటు దాదాపుగా ముగిసింది. జనసేన 32 స్థానాల్లో పోటీ చేస్తుందని గతంలోనే ప్రకటించింది. ఆ తర్వాత బీజేపీ నేతలు పవన్‌తో సమావేశమయ్యారు. ఢిల్లీలో అమిత్ షాతో భేటీ అనంతరం సీట్ల ఖరారుపై చర్చలు జరిపారు. జనసేన తమకు కనీసం 20 సీట్లు ఇవ్వాలని కోరింది. కానీ, చివరకు 9 సీట్లు కేటాయించినట్లు విశ్వసనీయ సమాచారం. టీడీపీ పోటీలో లేకపోవడంతో ఏపీ నుంచి సెటిలర్లు మెజారిటీగా ఉన్న నియోజకవర్గాల్లో జనసేనను బరిలోకి దింపాలనేది బీజేపీ వ్యూహం.
బీజేపీతో పొత్తులో భాగంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఆంధ్రా ప్రాంత ఓటర్లు ఎక్కువగా ఉన్న కూకట్ పల్లి, సేరిలింగంపల్లి, ఎల్బీనగర్ వంటి స్థానాలను కేటాయించాలని జనసేన భావిస్తోంది. మిగిలిన సీట్లను ఆంధ్రప్రదేశ్‌తో సరిహద్దులు పంచుకునే ఖమ్మం, నల్గొండ జిల్లాలకు కేటాయించే అవకాశం ఉంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా 29 రోజులు మాత్రమే మిగిలి ఉంది. అందుకే ప్రధాన పార్టీలన్నీ స్పీడ్ పెంచాయి!.. ఒకవైపు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభలతో దూసుకుపోతుంటే మరోవైపు కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ వరుస పర్యటనలతో తెలంగాణపై ప్రత్యేక దృష్టి సారించారు. బీజేపీ కూడా దూకుడు పెంచింది. పెండింగ్‌లో ఉన్న సీట్లకు అభ్యర్థులను ప్రకటించి ప్రచారంలో వేగం పెంచేందుకు సమాయత్తమవుతోంది. ఈ రాత్రికి తుది జాబితాను విడుదల చేసేందుకు బీజేపీ కసరత్తు చేస్తోంది. ఇవాళ సాయంత్రం ఢిల్లీలో సమావేశం కానున్న బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ తుది జాబితాను ఖరారు చేయనుంది. అలాగే జనసేనతో పొత్తు, సీట్ల సర్దుబాటుపై బీజేపీ సీఈసీ నిర్ణయం తీసుకోనుంది. జనసేనకు 9 నుంచి 11 సీట్లు ఇచ్చేందుకు బీజేపీ అగ్రనాయకత్వం అంగీకరించినట్లు తెలుస్తోంది.
ఆంధ్రా ఓటర్లు ఎక్కువగా ఉన్న కూకట్‌పల్లి, సేరిలింగంపల్లి, ఎల్బీనగర్ వంటి స్థానాలను జనసేన పార్టీ కోరుతోంది. అలాగే… ఖమ్మం, నల్గొండ జిల్లాల్లో మరికొన్ని సీట్లు అడుగుతోంది. అలాగే బీజేపీ మూడో జాబితాలో ఆసిఫాబాద్ – తుకారాం, చెన్నూరు – అందుగుల శ్రీనివాస్, మంచిర్యాల – రఘనాధ బాబు, బాన్సువాడ – మాల్యాద్రి రెడ్డి, బోదన్ – మేడపాటి ప్రకాష్ రెడ్డి/ వడ్డి మోహన్ రెడ్డి, నిజామాబాద్ రూరల్ – దినేష్, ఎల్లారెడ్డి – పైల కృష్ణా రెడ్డి, మంధాని – చందుపట్ల సునీల్ రెడ్డి, పెద్దపల్లి. -గొట్టిముక్కల సురేష్ రెడ్డి/ నల్ల మనోహర్ రెడ్డి, వేముల వాడ – వికాస్ రావు / తుల ఉమ, జహీరాబాద్ – ఢిల్లీ వసంత్, సంగారెడ్డి – పులిమామిడి రాజు, నారాయణ ఖేడ్ – విజయపాల్ రెడ్డి, అందోల్ – బాబూమోహన్, హుస్నాబాద్ – బొమ్మ శ్రీరామ్ చక్రవర్తి/జేఎస్ఆర్, సిద్దపేట – దూది శ్రీకాంత్ రెడ్డి, షాద్ నగర్ – శ్రీవర్ధన్ రెడ్డి / అందె బాబయ్య, ఎల్ బి నగర్ – సామ రంగారెడ్డి, రాజేంద్ర నగర్ – తోకల శ్రీనివాస్ రెడ్డి, సెరిలింగంపల్లి – రవి కుమార్ యాదవ్, చేవెళ్ల – కెఎస్ రత్నం, వికారాబాద్ – తులసి విజయరామ్, కొడంగల్ – చీకోటి ప్రవీణ్, మేడ్చల్ – విక్రమ్ రెడ్డి, సుదర్శన్ రెడ్డి పేర్లు ఖరారు అయ్యే అవకాశం ఉంది.
వీటితో పాటు మల్కాజ్ గిరి – ఆకుల రాజేందర్, ఉప్పల్ – ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్, ముషీరాబాద్ – పాపారావు/ బండారు విజయలక్ష్మి, మలక్ పేట – లింగాల హరిగౌడ్/ కొత్తకాపు రవీందర్ రెడ్డి, అంబర్ పేట – గౌతంరావు, జూబ్లీహిల్స్ – జాటూరి కీర్తిరెడ్డి, సనత్ నగర్ – మర్రి శశిద్ రెడ్డి, నాంపల్లి – విక్రమ్ గౌడ్, సికింద్రాబాద్ – బండ కార్తీక రెడ్డి, కంటోన్మెంట్ – మాజీ మంత్రి శంకర్ రావు కుమార్తె సుస్మిత, జడ్చర్ల – చిత్తరంజన్ దాస్, దేవరకద్ర – పవన్ కుమార్ రెడ్డి, అచ్చంపేట – సతీష్ మాదిగ, వనపర్తి – అశ్వత్థామ రెడ్డి, గద్వాల, నకరిగ్ధ రెడ్డి – పాల్వాయి రజని, నల్గొండ – శ్రీనివాసగౌడ్, మునుగోడు – బూర నర్సయ్య గౌడ్, దేవరకొండ – లాలూ నాయక్, మిర్యాలగూడ – సాదినేని శ్రీనివాస్, మధిర – అజయ్ కుమార్, సత్తుపల్లి – శ్యామ్ నాయక్. ఈ రాత్రి లేదా రేపు బీజేపీ మూడో జాబితాను ప్రకటించే అవకాశం ఉంది.
Panja Vaishnav Tej: వెనక్కి తగ్గిన ఆదికేశవ… నవంబర్ 10న విడుదల కావట్లేదు