
Revanth Reddy:నేను కంది పప్పునే కానీ.. కేటీఆర్ గన్నేరు పప్పు అంటూ టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కందిపప్పు ఆరోగ్య కరమైన దినుసు అని.. . కొడంగల్ లో పండించే పంట అన్నారు. కందిపప్పు ఆరోగ్యం ఇచ్చే పప్పు కంది పప్పు అన్నారు. కేటీఆర్ గన్నేరు పప్పు అని.. గన్నేరు పప్పు తింటే చస్తారని రేవంత్ అన్నారు. కమ్యూనిస్టు లతో చర్చలు భట్టి చేస్తున్నారని అన్నారు. మొదట్లో వాళ్ళు కేసీఆర్ తో ఉన్నారన్నారు. తర్వాత వచ్చిన మార్పులతో కమ్యూనిస్టులు మాతో వచ్చారని క్లారిటీ ఇచ్చారు. చర్చలు కొలిక్కి వచ్చాకా చెప్తా అన్నారు. చర్చలు ఇంకా ముగియలేదన్నారు. కమ్యూనిస్టులు మా సహజ మిత్రులన్నారు. అధిష్టానం కూడా మళ్లీ సూచనలు చేసిందన్నారు. కాళేశ్వరం పై కాగ్ నివేదిక ఇచ్చిందని క్లారిటీ ఇచ్చారు. ప్రభుత్వం విధానంతో కాస్ట్ పెంచింది అని కాగ్ చెప్పిందన్నారు రేవంత్. దీనిని కేటీఆర్ బుకాయించారని మండిపడ్డారు. ఇందిరా గాంధీ ప్రధానిగా ఉన్నంత కాలం.. రాజీవ్ గాంధీ ఏ పదవి తీసుకోలేదన్నారు.
రాజీవ్ ప్రధాని ఉన్నప్పుడు సోనియాగాంధీ పదవి తీసుకోలేదన్నారు. తెలంగాణ వస్తే.. నేను నా ముసల్ది ఉంటాం కాపలా కుక్కలెక్క ఉంటా అన్నాడు కానీ.. అధికారంలోకి రాగానే.. కేటీఆర్ మంత్రి.. హరీష్ మంత్రి అయ్యారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కుటుంబ పార్టీ అని కాంగ్రెస్ ని అనడం సరి కాదని.. కుటుంబం అందరికి పదవులు ఇచ్చింది కేసీఆర్ అని గుర్తు చేశారు. సీమాంధ్ర పాలకులు దోపిడీ చేశారు అనేది బీఆర్ఎస్ వాదన అన్నారు. తెలంగాణ ప్రజలు కోరుకున్నది స్వేచ్ఛ..సామాజిక న్యాయం.. సమాన అభివృద్ధి కోరుకున్నారని తెలిపారు. ఒక వ్యక్తి పాదాల కింద తెలంగాణ సమాజం నలిగిపోవడం సహించలేమన్నారు. ఈ ప్రాంత ప్రజల పోరాటం లో ధర్మం ఉందని సోనియాగాంధీ తెలంగాణ ఇచ్చారు. మట్టికి పోయినా ఇంటి వాడు పోవాలని కేసీఆర్ చెప్తారన్నారు. ఆయన చెప్పిన నీళ్లు వచ్చాయా..? పల్లెలకు నిధులు వచ్చాయా..? అని ప్రశ్నించారు. సీఎం కేసీఆర్ ఉద్యమంలో టీజీ అని అనుకున్నామన్నారు. కానీ తెలంగాణా వచ్చాకా టీఎస్ పెట్టుకున్నాడని మండిపడ్డారు.
Revanth Reddy: కేసీఆర్ పెట్టిన తెలంగాణ తల్లి.. శ్రీమంతుల తల్లిని చూపించారూ.. రేవంత్ కామెంట్