Leading News Portal in Telugu

BJP MP Laxman: కేసీఆర్ ప్రభుత్వం తెలంగాణ ప్రజలకు క్షమాపణలు చెప్పాలి..


BJP MP Laxman: కేసీఆర్ ప్రభుత్వం తెలంగాణ ప్రజలకు క్షమాపణలు చెప్పాలి..

మేడిగడ్డ కృoగిపోయింది.. అన్నారంలో బుంగ పడింది.. ఈ విషయం ప్రజలు గమనించాలి అని బీజేపీ రాజ్యసభ సభ్యులు లక్ష్మణ్ తెలిపారు. నదులకే నడకలు నేర్పిన వ్యక్తి అని మంత్రులు పొగిడారు.. పూర్తిగా నిర్లక్ష్యంగా డ్యామును నిర్మించారని డ్యామ్ సేఫ్టీ కమిటీ పేర్కొంది.. నివేదికలో డ్యామ్ ను పూర్తిగా పునాది స్థాయి నుంచి తిరిగి నిర్మించాలని డ్యామ్ సేఫ్టీ కమిటీ అధికారులు సూచించారు.. బ్యారేజీ కట్టడం వైఫల్యం వల్ల తెలంగాణ ప్రజల ఆర్థిక వ్యవస్థకు పూర్తిగా దెబ్బతింటుంది కమిటీ నివేదికలో తెలిపింది అని ఆయన ఆరోపించారు. కమిటీ 20 అంశాలను కోరితే.. రాష్ట్ర ప్రభుత్వం 11 అంశాలకు మాత్రమే సమాచారం ఇవ్వడం డొల్లతనం కనిపిస్తుందని ఎంపీ లక్ష్మణ్ మండిపడ్డారు.

తెలంగాణ ప్రజల జీవితాలతో ముడిపడి ఉన్న బ్యారేజ్.. 35 వేల కోట్లతో ఉన్న వ్యయంను లక్ష కోట్లకు నిర్మాణం చేశారు అని ఎంపీ లక్ష్మణ్ ఆరోపించారు. కాళేశ్వరంతో లక్ష ఎకరాల పంటకు నీరందిస్తామని కేసీఆర్ తో పాటు మంత్రులు చెప్పారు.. డ్యాంకు ఏమైనా జరిగితే కట్టిన సంస్థనే బాధ్యత భరిస్తుంది అని గతంలో తెలిపారు.. కేంద్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్టులను జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించలేదని గతంలో కేంద్ర ప్రభుత్వం పైన రాజకీయ విమర్శలు చేశారు అని లక్ష్మణ్ విమర్శించారు. కేసీఆర్ ప్రభుత్వం తెలంగాణ ప్రజలకు క్షమాపణలు చెప్పాలి.. ఇరిగేషన్ మంత్రి తన పదవికి రాజీనామా చేసి తెలంగాణ ప్రజల ముందు తన చెంపలు వాయించుకోవాలి బీజేపీ రాజ్యసభ సభ్యులు లక్ష్మణ్ డిమాండ్ చేశారు.