
ఈ నెల 7న ఏల్బి స్టేడియంలో తెలంగాణ బీసీ ఆత్మగౌరవ సభ నిర్వహించనున్నట్లు, దీనికి ముఖ్య అతిథిగా ప్రధాని మోడీ రానున్నట్లు ఎంపీ డాక్టర్ లక్ష్మణ్ వెల్లడించారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ బీసీ సీఎం నినాదాన్ని జీర్ణించుకోలేక పోతుందని, రాహుల్ బీసీలను అవహేళన చేస్తూ మాట్లాడారన్నారు. దీన్ని సవాలుగా తీసుకొని ముందుకి వెళ్తున్న బీసీలు.. ఈ సభకు బీసీలంత కదలి విజయవంతం చేయాలని ఆయన కోరారు. కేసీఆర్, రాహూల్ గాంధీకి తెలంగాణలో బీసీ సీఎంను చేస్తామని ప్రకటించే దమ్ము ఉందా? అని ఆయన సవాల్ విసిరారు.
కేసీఆర్ పదవుల్లో సామాజికత పాటించలేదని, బీజేపీ ప్రకటించిన 88 మందిలో అభ్యర్థుల్లో 31 మంది బీసీలు ఉన్నారన్నారు. బీసీ నేతలకు ఢిల్లీలో అపాయిన్మెంట్ ఇవ్వకుండా కాంగ్రెస్ బీసీలను అవమాన పరిచిందన్నారు లక్ష్మణ్. నామినేట్ పదవుల్లో బీసీలకు ప్రాధాన్యత ఇస్తామని, సీఎం అయ్యే సామర్థ్యం బీసీ లకు లేదా? అని ఆయన అన్నారు. కేటీఆర్ నీ గుణం ఇంత? నీ కులం ఎంత? తండ్రీ చెప్పుకునే నీవా బీసీల గురించి మాట్లాడేది? అని ఆయన మండిపడ్డారు. మీ నాన్న పేరు లేకుంటే వార్డ్ మెంబర్ అయిన గెలవగలవా? అని ఆయన ప్రశ్నించారు. 11న పరేడ్ గ్రౌండ్ లో జరిగే మందకృష్ణ నిర్వహించే సభకు కూడా ప్రధాని మోడీ హాజరుకానున్నారు.’ అని లక్ష్మణ్ తెలిపారు.