Leading News Portal in Telugu

Jayaprakash Narayana : “పాత పెన్షన్ విధానం” అమలు చేస్తామనే ఎన్నికల నినాదం దేశ వినాశనమే


Jayaprakash Narayana : “పాత పెన్షన్ విధానం” అమలు చేస్తామనే ఎన్నికల నినాదం దేశ వినాశనమే

ఢిల్లీలో “ఎఫ్.డీ.ఆర్” (ఫౌండేషన్ ఫర్ డెమోక్రాటిక్ రిఫార్మ్స్) ఆధ్వర్యంలో “జాతీయ రౌండ్ టేబుల్” సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఫౌండేషన్ ఫర్ డెమోక్రాటిక్ రిఫార్మ్ జనరల్ సెక్రటరీ జయప్రకాష్ నారాయణ్ మాట్లాడుతూ.. “ప్రభుత్వ ఖజానా పరిపుష్టి కోసం అర్ధవంతమైన, ఫలవంతమైన విధానం” పై మాట్లాడుతూ.. “ఓపిఎస్” దేశ ప్రయోజనాలకు విఘాతం. కొన్ని రాజకీయ పార్టీలు “పాత పెన్షన్ విధానం” అమలు చేస్తామనే ఎన్నికల నినాదం దేశ వినాశనమే అన్నారు. ప్రభుత్వ ఉద్యోగులు సమాజంలో భాగమని, దేశ ప్రయోజనాలు నాశనం కాకూడదన్నారు.

అంతేకాకుండా.. ‘”పాత పెన్షన్” తో దేశ ప్రయోజనాలు సర్వ నాశనం చేస్తుంది, ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం ఉంటుంది. “ఓపిఎస్” అమలౌతున్న రాష్ట్రాలు ఆర్ధిక భారంతో కోలుకోవడం లేదు. ఇది ఆత్మహత్యాసదృశం. ప్రభుత్వ ఉద్యోగుల్లో భయం ఉండటం సహజం. దేశం సర్వనాశనం అయినా పర్వాలేదు….మాకు ఒక్క శాతం ఓటు వస్తే చాలు అనుకోవడం వినాశనానికి దారితీస్తుంది. మూడు శాతం ఉన్న ఉద్యోగులను ప్రసన్నం చేసుకునేందుకు, 97 శాతం ప్రజల బతుకులను దెబ్బతీయడమే అవుతుంది. “ఓల్డ్ పెన్షన్ స్కీమ్” జాతి జీవన్మరణ సమస్య. ఈ విషయంలో రాజకీయం చేయొద్దు. “రెఫ్యుజ్ ఓపిఎస్.ఇన్” అనే వెబ్ సైట్ లో అన్ని వివరాలు ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల సమయంలో ఎమి జరుగుతుందో అందరికి తెలుసు.ఉచితాలకు ఓట్లు వేస్తూ ప్రజలు తమ భవిష్యత్ గురించి ఆలోచించడం లేదు, పట్టించుకోవడం లేదు.’ అని జయప్రకాష్‌ నారాయణ్‌ వ్యాఖ్యానించారు.