
Janareddy vs Tammineni: సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రానికి మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి ఆదివారంనాడు ఫోన్ చేశారు. పోటీ చేసే అభ్యర్థుల జాబితా విడుదలను నిలిపివేయాలని జానారెడ్డి కోరారు. అయితే జానారెడ్డి సూచనపై కుదరదని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం తేల్చి చెప్పారు. రాష్ట్రంలోని 17 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేస్తామని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఇదివరకే ప్రకటించారు. ఇవాళ అభ్యర్ధుల జాబితాతో పాటు ఎన్నికల మేనిఫెస్టోను తమ్మినేని వీరభద్రం ప్రకటించనున్నారు. దీంతో అభ్యర్ధుల ప్రకటనను నిలిపివేయాలని జానారెడ్డి తమ్మినేని వీరభధ్రానికి ఫోన్ చేశారు. సీట్ల సర్ధుబాటు విషయమై కాంగ్రెస్ అనుసరించిన విధానంతో సీపీఎం తీవ్ర అసంతృప్తితో ఉంది.కాంగ్రెస్ తీరు అవమానకరరీతిలో ఉందని తమ్మినేని వీరభద్రం ప్రకటించారు.ఈ పరిస్థితుల్లో పొత్తు అవసరం లేదని ఈ నెల 1న జరిగిన సీపీఎం రాష్ట్ర కమిటీ సమావేశం నిర్ణయం తీసుకుంది.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సీపీఎం అభ్యర్థుల జాబితా విడుదలైంది. కాంగ్రెస్ పార్టీతో పొత్తు కుదరకపోవటంతో 14 స్థానాలకు ఆ పార్టీ అభ్యర్థులను ఖరారు చేసింది. ఉమ్మడి ఖమ్మం, నల్గొండ జిల్లాల్లో ఎక్కవగా సీట్లు కేటాయించారు. పాలేరు నుంచి ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం బరిలోకి దిగుతున్నారు.
సీపీఎం అభ్యర్ధుల జాబితా ఇదే
1.పటాన్‌చెరు- మల్లికార్జున్
2.ముషీరాబాద్-దశరథ్
3.భద్రాచలం- కారం పుల్లయ్య
4.ఆశ్వరావుపేట-పి.అర్జున్
5.పాలేరు-తమ్మినేని వీరభద్రం
6.మధిర-పాలడుగు భాస్కర్
7.వైరా-భూక్యా వీరభద్రం
8.ఖమ్మం-శ్రీకాంత్
9.సత్తుపల్లి-భారతి
10.మిర్యాలగూడ-జూలకంటి రంగారెడ్డి
11.నకిరేకల్-చినవెంకులు
12. భువనగిరి-నర్సింహ
13.జనగామ-కనకారెడ్డి
14.ఇబ్రహీంపట్టణం-పగడాల యాదయ్య
ఈ నెల రెండో తేదీన ఒంటరి పోరు చేస్తామని సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ప్రకటించారు. 17 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేయనున్నట్టుగా ఆయన తెలిపారు.
Ranjana Naachiyar: బస్సు ఆపి స్కూల్ పిల్లల్ని కొట్టిన నటి అరెస్ట్