Leading News Portal in Telugu

Bandi Sanjay: ఆ సంస్కృతి మా పార్టీలో లేదు.. కాంగ్రెస్ పై బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు


Bandi Sanjay: ఆ సంస్కృతి మా పార్టీలో లేదు.. కాంగ్రెస్ పై బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

Bandi Sanjay: మా బిజెపిలో ముఖ్యమంత్రిని ముందుగానే ప్రకటించే సంస్కృతి లేదని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ రాష్ట్రంలో బిజెపి ఈ ఎన్నికలలొ ప్రభుత్వం ఎర్పాటు చెయబోతుందన్నారు. బిసి ని ముఖ్యమంత్రి ని చేస్తామని ప్రకటించామన్నారు. బిసి, ఎస్సి, అగ్ర వర్ణాల పేదలు బిజేపి మద్దతు తెలుపుతున్నారని తెలిపారు. ఈనెల 7 రొజున బిసి అత్మీయ గౌరవ సభ నిర్వహిస్తాం…ప్రదాని మోడి హాజరు అవుతారన్నారు. స్వచ్ఛందంగా అందరూ తరలిరావాలన్నారు.

మోడి ప్రదాని అయిన తరువాత బిసిలకి న్యాయం జరుగుతుందన్నారు. 27 మంది బిసిలని మంత్రులని చేసిన ఘనత భారతీయ జనతా పార్టీ ది అన్నారు. బిసిని ప్రదానిని చేసిన ఘనత బిజేపి ది అని తెలిపారు. 23 సీట్లు మాత్రమే బిఆర్ఎస్ బిసిలకి ఇచ్చిందన్నారు. బిసిలకి‌ టికెట్లు ఇవ్వకుండా కాంగ్రెస్ పార్టి అవమాన పరిచిందన్నారు. రేపు కరీంనగర్ అసెంబ్లీ బిజేపి అభ్యర్థి గా నామినేషన్ వేస్తున్నానని తెలిపారు. బిసి నినాదం బిఅర్ఎస్ ఎందుకు పక్కకు పెట్టారని తెలిపారు. బిసిలకి బిఅర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు క్షమాపణ చెప్పాలన్నారు. బిసిలకి ముఖ్యమంత్రి ఇవ్వాలని కాంగ్రెస్, బిఆర్ఎస్ నాయకులు ప్రశ్నించాలన్నారు. వాస్తవ నివేదికలు ఇస్తే ప్రభుత్వం తట్టుకోవడం లేదన్నారు. తాంత్రిక పూజలు చేయడానికి టైం ‌ఉంటది, కాని కాళేశ్వరం ని సందర్శించడానికి సమయం లేదా? అని సంచలన వ్యాఖ్యలు చేశారు.

పిల్లర్లకి పగుళ్లు వచ్చాయ లేదా, మోటర్లు మునిగాయా లేదా అని కెటిఆర్, కెసిఆర్ సమాధానం చెప్పాలన్నారు. ముఖ్యమంత్రి కుటుంబం నుండి కాళేశ్వరం కి‌ సంబంధించిన డబ్బులు రాబడుతాం…కెసిఆర్ అస్తులు‌ జప్తు చేస్తామన్నారు. తెలంగాణ ప్రజల ఆస్తి కాళేశ్వరం ప్రాజెక్టు అన్నారు. మాది కుటుంబం పార్టీ కాదు,మా నిర్ణయాలు ప్రగతిభవన్ నుండి రావు అన్నారు. కాళేశ్వరం కుంగుబాటు నిజం అయినపుడు,నివేదికలు ఎందుకు నిజం కాదన్నారు. మేము నిపుణులని పట్టుకొని వస్తాం…మీరు వస్తారా అని‌ సవాల్ అన్నారు. వాస్తవాలు తెలంగాణ రాష్ట్ర ప్రజలకి తెలియాలి…సవాల్ కి సిద్ధమా? అన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారం లోకి వచ్చే పరిస్థితి లేదన్నారు. రానున్న రోజులలో రేవంత్ రెడ్డి బలి పశువు కాక తప్పదన్నారు. తెలంగాణలో రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేయవద్దని ముస్లీం మత పెద్దలు రాహుల్ గాంధీని కలిసారన్నారు. గాంధీ భవన్ ముఖ్యమంత్రి పొగ అలుముకుందన్నారు.

ముఖ్యమంత్రి కొసమే కాంగ్రెస్ ‌పార్టీ‌ కొట్లాడుతుందన్నారు. మా బిజెపిలో ముఖ్యమంత్రిని ముందుగానే ప్రకటించే సంస్కృతి లేదన్నారు. బండి‌సంజయ్ ముఖ్యమంత్రి‌ అవుతారని ఒకరద్దరూ చెబితే కాదు..కరీంనగర్ లో బిఅర్ఎస్ అభ్యర్థి ఓడిపోతాడని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏ సర్వే చూసిన కరీంనగర్ బిజేపి గెలుస్తది అని చెబుతుందన్నారు. ఖబ్జా రాయుల్లు ఓడిపొతారని కీలక వ్యాఖ్యలు చేశారు. రెండు పార్టీల నాయకులు కరీంనగర్ లో బిజెపి పార్టి గెలవాలని కొరుకుంటున్నారని తెలిపారు. సింగిల్ గానె తెలంగాణలో ప్రబుత్వాన్ని ఎర్పాటు చేస్తామన్నారు.
Maa Oori Polimera 2 : మా ఊరి పొలిమేర 2 రెండు రోజుల బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ ఎంతంటే..?