
ఖమ్మం జిల్లాలో జరుగుతున్న ఎన్నికల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ కు తుమ్మల నాగేశ్వరరావుకు మద్య మాటల యుద్దం సాగుతుంది. తుమ్మల కు పిలిచి మంత్రి పదవి ఇస్తే ఆయన జిల్లాలో గుండు సున్నా పెట్టారన్న సిఎం వ్యాఖ్యలకు తుమ్మల కౌంటర్ ఇచ్చారు. పార్టీ వర్కింగ్ ప్రసిడెంట్ కెటిఆర్ కారణం అంటూ జల్లాలో పార్టీ ఓటమికి కూడ కెటిఆర్ కారణమని అజయ్ కి మంత్రి పదవి ఇచ్చేందుకు కెటిఆర్ కుట్రలు పన్నారని తుమ్మల ఆరోపించారు.
వాయిస్ఓవర్.. ఖమ్మం జిల్లా కేంద్రంలో ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రజా ఆశ్వీర్వాద సభ లో సిఎం కెసిఆర్ తుమ్మల పై ద్వజం ఎత్తారు. ఆయన నాకు పదవి ఇప్పించారంట అని అంటూనే తాను పదవి ఇప్పించిన విషయం అందరికి తెలిసిందే అని కెసిఆర్ అన్నారు. అయితే తాను పిలిచి తుమ్మలకు పదవిని ఇస్తే జిల్లాలో పార్టీకి గుండు సున్నా పెట్టారని అన్నారు.
అయితే కెసిఆర్, మంత్రి అజయ్ కుమార్ లు తుమ్మల నుద్దేశించి మాట్లాడడంతో మరో సారి తుమ్మల నాగేశ్వర రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. మొన్న పాలేరు సభలో కూడ తుమ్మలపై కెసిఆర్ కామెంట్ చేశారు. ఆనాడు కూడ తుమ్మల కెసిఆర్ పై ద్వజం ఎత్తారు. మళ్లీ తుమ్మల కెసిఆర్ పై మాట్లాడుతు జిల్లాలో పార్టీకి వంద ఓట్లు కూడ లేని రోజుల్లో తాను పార్టీలోకి వచ్చి పార్టీని పెంచింది నిజం కాదా అన్నారు. అంతే కాదు మొన్నటి ఎన్నికల్లో మంత్రి గా అజయ్ కుమార్ కు పదవి రావడం కోసం పార్టీ వర్కింగ్ ప్రసిడెంట్ కెటిఆర్ పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారని తుమ్మల ఆరోపించారు. సత్తుపల్లి, కొత్తగూడెం, వైరా , పాలేరు లలో పార్టీ అబ్యర్ధులకు వ్యతిరేకంగా కెటిఆర్ వ్యవహరించారని అందువల్లనేఅక్కడ ఓటమి పాలు అయ్యామన్నారు. పాలేరు లో కూడ తనని ఓడించడం కోసం కుట్ర పన్నింది నిజం కాదా అజయ్ ద్వారా తనకు వ్యతిరేకంగా డబ్బులును ఖర్చు పెట్టింది నిజం కాదా అంటూ ప్రశ్నించారు. మరోవైపున అజయ్ కుమార్ పై కూడ తీవ్ర పదజాలంతో విమర్శించారు. అజయ్ కుమార్ కు ఏమి చేతకాదని ఈ నెల 30 న 14 అడుగుల గోతిలో పాతి పెడతారని తుమ్మల నాగేశ్వరరావు అన్నారు.