Leading News Portal in Telugu

Tammineni: కాంగ్రెస్‌ కి కాంటాక్ట్‌ చేస్తే రేపు, ఎల్లుండి అన్నారు.. అందుకే జాబితా విడదల చేసాం..


Tammineni: కాంగ్రెస్‌ కి కాంటాక్ట్‌ చేస్తే రేపు, ఎల్లుండి అన్నారు.. అందుకే జాబితా విడదల చేసాం..

Tammineni: కాంగ్రెస్ నేతలు కాంటాక్ట్ చేయడం.. రేపు ఎల్లుండి అంటున్నారని సీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. సీపీఐ నేతలు.. రేవంత్ తో మాట్లాడారు అన్నారు. ఒక సీటు.. ఎంఎల్సీ ఇస్తాం అన్నారు అని తెలిపారు. మేము వైట్ చేయడం సాధ్యం కాదన్నారు. అందుకే అభ్యర్థుల ప్రకటన చేస్తున్నమని క్లారిటీ ఇచ్చారు. మూడు నినాదాలతో ఎన్నికలకు సిద్దమయ్యామని తెలిపారు. కమ్యూనిస్టుల వల్లనే.. సమాచార హక్కు.. ఉపాధి హామీ వచ్చిందన్నారు. మొదటిది.. సీపీఎం కి అసెంబ్లీ కి వెళ్లే అవకాశం ఇవ్వాలని కోరారు. రెండోది.. వామపక్ష పార్టీలను బలపరచండి అని పిలుపునిచ్చారు. ఇక మూడో నినాదం.. బీజేపీ దుర్మార్గ పాలనకు స్వస్తి పలకాలని కోరారు. బీజేపీ గెలిచే చోట.. ఓడించ గలిగే అభ్యర్థికి ఓటు వేయండి అని చెప్పదలుచుకున్నామన్నారని తెలిపారు. మేనిఫెస్టో కూడా విడుదల చేస్తున్నామన్నారు. జర్నలిస్టులకు మూడు వందల గజాలు స్థలం, 10 వేలు పెన్షన్ ఇస్వామని హామీ ఇచ్చారు. కొత్తగూడంలో సీపీఐ పోటీ చేస్తోందని స్పష్టత ఇచ్చారు. సీపీఐకి మద్దతు ఇవ్వాలని కోరారు. సీపీఐ పోటీ చేసే చోట మేము మద్దతు ఇస్తామన్నారు. ఈనెల 7న పాలేరులో నామినేషన్ వేయనున్నట్లు తమ్మినేని క్లారిటీ ఇచ్చారు.
నల్గొండ.. కోదాడ, హుజుర్ నగర్ లో పోటీ చేసే అభ్యర్థుల పేర్లు త్వరలో ప్రకటిస్తామన్నారు.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితాను సీపీఎం ఆదివారం విడుదల చేసింది. సీపీఎం తొలి జాబితాలో 14 మందికి చోటు దక్కింది. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఇవాళ ఆ పార్టీ రాష్ట్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో తమ పార్టీ అభ్యర్థుల జాబితాను విడుదల చేశారు. తమ పార్టీ అభ్యర్థులు పోటీ చేసే జిల్లాల్లో ఎన్నికల ఏర్పాట్లలోకి వెళ్లాలని పార్టీ సమావేశంలో నిర్ణయించినట్లు తమ్మినేని వీరభద్రం తెలిపారు. మిగిలిన మూడు అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థుల జాబితాను త్వరలో విడుదల చేస్తామని తమ్మినేని వీరభద్రం తెలిపారు. అసెంబ్లీలో సీపీఎం ప్రాతినిధ్యం కల్పించండి.. తమ పార్టీ ప్రాతినిధ్యం వహిస్తేనే పేద ప్రజల సమస్యలు అసెంబ్లీలో లేవనెత్తుతారని తమ్మినేని వీరభద్రం అన్నారు.

చట్టసభల్లో కమ్యూనిస్టులు బలంగా ఉన్నప్పుడు ఉపాధి హామీ చట్టం, ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా పోరాడారని తమ్మినేని వీరభరం గుర్తు చేశారు. ఈ విషయాలను తెలంగాణ ప్రజలు గుర్తుంచుకోవాలి. సీపీఎంతో పాటు వామపక్ష శక్తులను బలోపేతం చేయాలని తమ్మినేని వీరభరం ప్రజలను కోరారు. సిపిఎం బలపరిచిన శక్తులకు సంఘీభావం తెలపాలన్నారు. బీజేపీని నిలదీయాల్సిన అవసరం ఉందన్నారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వచ్చే పరిస్థితి లేదన్నారు. మహాకూటమి గెలిచే స్థానాల్లో ఏ పార్టీ బీజేపీని ఓడించినా తమ పార్టీ మద్దతు ఇస్తుందని తమ్మినేని వీరభద్రం అన్నారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం పార్టీ ఎన్నికల మేనిఫెస్టోను కూడా విడుదల చేశారు. ఈ నెల రెండో తేదీన ఒంటరి పోరాటం చేస్తామని సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ప్రకటించారు. 17 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేస్తానని చెప్పారు.

ఇదీ సీపీఎం అభ్యర్థుల జాబితా.

1. పటాన్చెరు- మల్లికార్జున్
2.ముషీరాబాద్-దశరథ్
3. భద్రాచలం- కారం పుల్లయ్య
4. అశ్వారావుపేట-పి. అర్జున్
5. పాలేరు-తమ్మినేని వీరభద్రం
6. మధిర-పాలడుగు భాస్కర్
7. వైర్-భుక్య వీరభద్రం
8. ఖమ్మం-శ్రీకాంత్
9. సత్తుపల్లి-భారతీయుడు
10. మిర్యాలగూడ-జూలకంటి రంగారెడ్డి
11.నకిరేకల్-చినవెంకులు
12. భువనగిరి-నర్సింహ
13. జనగామ-కనకారెడ్డి
14. ఇబ్రహీంపట్నం-పగడాల యాదయ్య

Israel Attack: పాలస్తీనియన్ల హత్యకు నిరసనగా ఇజ్రాయెల్‎లో తన రాయబారిని వెనక్కి పిలిచిన టర్కీ