Leading News Portal in Telugu

Congress Third List: కాంగ్రెస్‌ మూడో జాబితా విడుదల.. కామారెడ్డి బరిలో రేవంత్‌


Congress Third List: కాంగ్రెస్‌ మూడో జాబితా విడుదల.. కామారెడ్డి బరిలో రేవంత్‌

Congress Third List: తెలంగాణ కాంగ్రెస్‌ అభ్యర్థుల మూడో జాబితా విడుదలైంది. 16 అభ్యర్థులతో మూడో జాబితాను కాంగ్రెస్ అధిష్ఠానం విడుదల చేసింది. నామినేషన్లు మరో ఐదు రోజుల్లో ముగియనున్నాయి. టికెట్ కోసం తీవ్ర పోటీ నెలకొన్న స్థానాలను ఎట్టకేలకు కాంగ్రెస్ ప్రకటించింది. తొలి జాబితాలో 55 మంది, రెండో జాబితాలో 45 మంది అభ్యర్థులను కాంగ్రెస్ ఖరారు చేసింది. తాజాగా 16 స్థానాల్లో అభ్యర్థులను ఫైనల్ చేసింది. ఇంకా రెండు స్థానాలు మాత్రం ఇంకా పెండింగ్‌లోనే ఉండడం గమనార్హం. సూర్యాపేట, తుంగతుర్తి స్థానాల్లో అభ్యర్థులను ఇంకా ఖరారు చేయలేదు.

మూడో జాబితా కాంగ్రెస్ అభ్యర్థులు వీరే..
చెన్నూరు- వివేకానంద్
బోథ్ – ఆడే గజేందర్‌
జుక్కల్-తోట లక్ష్మీకాంతా రావు
బాన్సువాడ-ఏనుగు రవీందర్‌ రెడ్డి
కామారెడ్డి- రేవంత్ రెడ్డి
నిజామాబాద్‌ అర్బన్- మహ్మద్ షబ్బీర్ అలీ
కరీంనగర్‌-పురుమల్ల శ్రీనివాస్
సిరిసిల్ల- కొందం కరుణ మహేందర్ రెడ్డి
నారాయణఖేడ్- సురేశ్ కుమార్‌ షెట్కార్
పటాన్‌చెరు-నీలం మధు ముదిరాజ్
వనపర్తి- తుడి మేఘారెడ్డి
డోర్నకల్‌-జాటోత్ రామచంద్రు నాయక్
ఇల్లందు-కోరం కనకయ్య
వైరా-రాందాస్ మాలోత్
సత్తుపల్లి-మట్టా రాగమయి
అశ్వారావు పేట- జారె ఆదినారాయణ