
Komatireddy Venkat Reddy: కాంగ్రెస్ సీనియర్ నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి ముఖ్యమంత్రి పదవిపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఏదో ఒక రోజు సీఎం అవుతానని ఆయన అన్నారు. కానీ నాకు సీఎం కావాలని లేదని కోమటిరెడ్డి పేర్కొన్నారు. నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి అంతా తన హయాంలోనే జరిగిందన్నారు. మీ ఆదరణ చూస్తుంటే చర్మం వలిచి చెప్పులు కుట్టించినా తక్కువేనని ఆయన అన్నారు. మాయమాటలు చెప్పి 2018లో బీఆర్ఎస్ గెలిచి.. మోసం చేశారన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. పోలింగ్‌కు ముందు రైతుబంధు డబ్బులు అకౌంట్‌లో వేస్తారు.. మోసపోవద్దన్నారు.
ఏపీలో కాంగ్రెస్‌కు నష్టం జరుగుతుంది అని తెలిసినా సోనియా గాంధీ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు ఆమోదం తెలిపిందన్నారు. ఉద్యోగ ఖాళీల భర్తీలో ప్రభుత్వం విఫలమైందన్నారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఆత్మహత్యల కోసం తెలంగాణ తెచ్చుకోలేదన్నారు.ప్రభుత్వ, రిటైర్డ్ ఉద్యోగులకు జీతాలు సరైన సమయంలో అందించడంలో కేసీఆర్ సర్కార్ విఫలమైందని ఆయన మండిపడ్డారు. ఉపాధి అవకాశాలు కల్పన లక్ష్యంగా పనిచేస్తామన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఒకటో తేదీనే జీతాలు ఇస్తామన్నారు.