Leading News Portal in Telugu

MLA Laxmareddy: నీటి కష్టాలు తొలగినయ్.. ప్రచారంలో ఎమ్మెల్యేకు తెలిపిన మహిళలు


MLA Laxmareddy: నీటి కష్టాలు తొలగినయ్.. ప్రచారంలో ఎమ్మెల్యేకు తెలిపిన మహిళలు

MLA Laxmareddy: జడ్చర్ల మున్సిపాలిటీలోని పాతబజార్ 13వ వార్డు, 22వ వార్డుల్లో ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. తెలంగాణ ప్రభుత్వం వచ్చాకే తమకు తాగునీటి కష్టాలు తీరాయని ఈ సందర్భంగా వార్డులో మహిళలు ఎమ్మెల్యేకు వివరించారు. వార్డులోని ప్రతి గల్లీలో తిరుగుతూ ప్రభుత్వ పథకాలపై ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి ఆరా తీశారు. ఇంటింటి ప్రచారం నిర్వహిస్తున్న సందర్భంలో అక్కడే ఉన్న వృద్ధులను ఆప్యాయంగా పలకరించారు. పెన్షన్ టైంకి ఇస్తున్నారా లేదా అడిగి తెలుసుకున్నారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డాకే కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలతో ఆడబిడ్డ పెళ్లికి ప్రభుత్వం లక్ష రూపాయల ఆర్థిక సాయం అందిస్తుందని అన్నారు.

వచ్చే బీఆర్ఎస్ ప్రభుత్వంలో మేనిఫెస్టోలో పేర్కొన్న విధంగా పింఛన్లను రూ.5016/- కు పెంచుతామని, మహిళలకు సౌభాగ్యలక్ష్మీ పథకం కింద నెలకు మూడువేలు అందజేసేందుకు ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. జడ్చర్ల మరింత అభివృద్ధి బాటలో పయనించాలంటే మళ్ళీ కారు గుర్తుకే అందరూ ఓటేసి ఆశీర్వదించాలని కోరారు.