Leading News Portal in Telugu

Minister KTR: మీరు చూసింది ట్రైలర్ మాత్రమే.. ఇంకా చాలా ఉంది..


Minister KTR: మీరు చూసింది ట్రైలర్ మాత్రమే.. ఇంకా చాలా ఉంది..

Minister KTR: ది పార్క్ హోటల్ తెలంగాణ ఇండస్ట్రియలిస్ట్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో పారిశ్రామికవేత్తలతో సోమాజిగూడలో ఇంటరాక్టివ్‌ మీటింగ్‌కు మంత్రి కేటీఆర్‌ హాజరై ఎన్నికల్లో పారిశ్రామికవేత్తల మద్దతు కోరారు. తాను ఇక్కడికి పూర్తి రాజకీయ నాయకుడుగానే వచ్చానని, మీ మద్దతు కావాలని పారిశ్రామిక వేత్తలను ఆయన కోరారు. పారిశ్రామికవేత్తలాగా కాకుండా ఒక్క పౌరుడిగా ఆలోచన చేయాలన్నారు. తెలంగాణ వచ్చిన తరవాత కేసీఆర్‌ను ఎంత మంది ఎన్ని మాటలు అన్నారో గుర్తు చేసుకోవాలన్నారు.

పరిపాలన రాదు, కరెంట్ ఉండదు ఆంధ్ర వాళ్ళను వెల్లగొడతారు అని, గొడవలు జరుగుతాయి అని అన్నారని.. భూములు విలువ పడిపోతుంది అని కొంత మందికి అనుమానాలు, అపోహలు ఉండేవన్నారు. పరిశ్రమలకు టైం బౌండ్ పర్మిషన్స్ ఇస్తున్నారా అని ఆనాడు సీఎం కేసీఆర్ అధికారులను అడిగితే సరైన సమాధానం రాలేదని మంత్రి కేటీఆర్ చెప్పారు. రెండు రోజులు పాటు పవర్ హాలిడే ఉంటే కార్మికులు ఎలా బ్రతుకుతారు అని అన్నారని.. పవర్ సమస్య ఎంత తీవ్రంగా ఉండే తెలంగాణలో ఆనాడు అని మంత్రి గుర్తు చేశారు. 10 నిమిషాలు కరెంట్ పోతే ఇప్పుడు తట్టుకోలేపోతున్నారని కేటీఆర్‌ పేర్కొన్నారు. కర్ణాటక డిప్యూటీ సీఎం వచ్చారు, పాపం ఆయనకు కరెక్ట్ స్క్రిప్ట్ ఇవ్వలేదు, కర్ణాటకలో 5 గంటలు కరెంట్ ఇస్తున్నాం అంటే కింద ఉన్న వారు నవ్వుతున్నారని ఎద్దేవా చేశారు. భారతదేశంలో అత్యధిక తలసరి ఆదాయం 3లక్షల 17 వేలు దాకా ఉందన్నారు. 2014కు ముందు నగర శివార్లలో 14 రోజులకు ఒక్కసారి నీరు వచ్చేవి.. ఇప్పుడు రోజూ వస్తున్నాయని మంత్రి చెప్పారు.

మా ఆలోచనలు ఇంకా ఉన్నాయని …24 గంటలు నీళ్లు ఇవ్వాలి అనేది ఆలోచన ఉందన్నారు. మీరు చూసింది ట్రైలర్ మాత్రమే …ఇంకా చాలా ఉందన్నారు మంత్రి కేటీఆర్. 2014కు ముందు భూములు ధరలు ఎలా ఉన్నాయి, ఇప్పుడు ఎలా ఉన్నాయని ఆయన ప్రశ్నించారు. ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడకి పరిశ్రమల వస్తున్నాయంటే స్థిరమైన ప్రభుత్వం ఉండడం వల్లేనని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వం స్థిరత్వం లేకపోతే ముందుగా దెబ్బ తినేది పరిశ్రమలే అంటూ మంత్రి చెప్పారు. అదే వేరే వాళ్ళు వస్తే వాళ్ళు ఢిల్లీకి వెళ్లి వాళ్ళ పర్మిషన్ తీసుకోవాలి, వాళ్ళని ఒప్పించాలంటూ ఆయన స్పష్టం చేశారు. అవినీతి లేకుండా ప్రభుత్వం పరిశ్రమలకు ప్రోత్సాహం అందించిందని పారిశ్రామికవేత్తలకు ఆయన చెప్పారు.