
తెలంగాణలో సామాజిక న్యాయం చేసే ప్రభుత్వం రావాలన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి. ఇవాళ ఆయన మాట్లాడుతూ… కేసీఆర్ ఎస్సీ నీ సీఎం ఎందుకు చేయలేదు అంటే అయన ఎస్సీ సీఎం కాదు తననే ఉండమని ప్రజలు అన్నారు అని చెప్పారన్నారు. ఎస్సీల లో సమర్థులు లేరా… తీవ్రవాదం లేని భారత దేశం అవసరం.. మోడీ కూకటి వేళ్ళతో పీకేస్తున్నారని ఆయన అన్నారు. దీపావళి తరవాత బీజేపీ ప్రచారం ఉదృతం చేస్తామన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ల నిజ స్వరూపమన్నారు. ఐటీ దాడులు రోజు ఎక్కడో ఒక దగ్గర జరుగుతుంటాయని, ఎక్కడ జరుగుతున్నాయి నాకు తెలియదన్నారు కిషన్ రెడ్డి. ఐటీ పని నే దాడులు చేయడమేనని, పొంగులేటి తనపై ఐటీ దాడులు జరుగుతాయని ముందే చెప్పారు ఆయనకు ఎలా తెలుసు అన్నారు.
ఐటీ, ఈడీ, సీబీఐ లను ఏర్పాటు చేసింది కాంగ్రెస్ పార్టీ అని బీజేపీ కాదన్నారు. ఆ సంస్థల బాధ్యతల్ని అవి నిర్వహిస్తున్నాయని, ఇంకా సీట్లు ప్రకటించని సీట్లలో అభ్యర్థులకు సమాచారం ఇచ్చామన్నారు. కాంగ్రెస్ ది అమ్ముడు పోయే చరిత్ర అని కిషన్ రెడ్డి విమర్శించారు. కర్ణాటక లో ఇచ్చిన హామీ లు నెరవేర్చకపోతే అక్కడి కాంగ్రెస్ ఎమ్మేల్యేలు అసంతృప్తి తో ఉంటే మేము ఏమి చేస్తామన్నారు. ఒకటి రెండు చోట్ల బీజేపీ అభ్యర్థుల ను మార్చే అవకాశం ఉందని, బీఆర్ఎస్ దున్నపోతులను తినే పార్టీ అయితే కాంగ్రెస్ ఏనుగులను తినే పార్టీ అని ఆయన వ్యాఖ్యానించారు. దేశంలో సర్వ సమస్యలకు కారణం కాంగ్రెస్ .. ఆ పార్టీనా మమ్మల్ని ప్రశ్నించేది అంటూ కిషన్ రెడ్డి ధ్వజమెత్తారు.