Leading News Portal in Telugu

Minister KTR : రేవంత్ అహంకారంతో మాట్లాడారు



Minister Ktr

రేవంత్ రెడ్డి మరో సారి వ్యవసాయ రంగం పై అవగాహన లేమిని బయట పెట్టారన్నారు మంత్రి కేటీఆర్‌. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అమెరికాలో అజ్ఞానంతో రేవంత్ మాట్లాడారు అనుకున్నామని, మూడు గంటలు కరెంట్ వ్యవసాయ రంగంకు చాలు అంటున్నారన్నారు. రైతులకు మూడు గంటల కరెంట్ చాలు …మా పార్టీ వైఖరి అదే అని రేవంత్ చెప్పారు…నిస్సిగ్గుగా అని ఆయన మండిపడ్డారు. రేవంత్ అహంకారం తో మాట్లాడారని, రైతులను బిచ్చ గళ్లు అని రేవంత్ అన్నారని మంత్రి కేటీఆర్‌ ధ్వజమెత్తారు. వ్యవసాయంలో ఎన్ని HP మోటార్లు వాడుతారో రేవంత్ కు తెలియదని మంత్రి కేటీఆర్‌ ఎద్దేవా చేశారు. కరెంట్ కావాలా…కాంగ్రెస్ కావాలా ప్రజలు ఆలోచించాలన్నారు మంత్రి కేటీఆర్‌.

Also Read : South Central Railway: పండుగల సీజన్‌.. రైళ్ల రాకపోకలపై దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక దృష్టి

కాంగ్రెస్ హయాంలో రైతులకు క్రాప్ హాలిడే లు….పరిశ్రమలకు పవర్ హాలిడే లు ఉండేవని, ఉచిత విద్యుత్, సాగునీటికి బీఆర్‌ఎస్‌ సర్కార్ అధిక ప్రాధాన్యత ఇచ్చిందన్నారు మంత్రి కేటీఆర్‌. ఇవాళ తెలంగాణలో కాలిపోయే మోటార్లు లేవు… పెలిపోయే ట్రాన్సఫర్లు లేవన్నారు మంత్రి కేటీఆర్‌. బీజేపీ మోటార్లు మీట్లర్లు పెట్టాలని బ్లాక్ మెయిల్ చేస్తుందన్నారు. రైతుకు భీమా ఇచ్చే సర్కార్ ఎక్కడ అయిన ఉందా ? అని మంత్రి కేటీఆర్‌ ప్రశ్నించారు. కాంగ్రెస్ దమన నీతి పాటిస్తుందని, బీఆర్‌ఎస్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత పెండింగ్ ప్రాజెక్ట్ లు …రన్నింగ్ ప్రాజెక్ట్ లు అయ్యాయన్నారు. బీఆర్ఎస్ అంటే పంట కోతలు…కాంగ్రెస్ అంటే కరెంట్ కోతలు అని ఆయన అన్నారు. రైతులను అవమానించే విధంగా మాట్లాడుతున్నది దిక్కుమాలిన పార్టీ కాంగ్రెస్ అని మంత్రి కేటీఆర్‌ అన్నారు.

Also Read : Manda Krishna Madiga: మోడీ గారు.. మీరు ఎస్సీ వర్గీకరణ చేయండి..