Leading News Portal in Telugu

Madhu Yashki : ప్రభుత్వ ఆస్తులపై బీఆర్ఎస్ ఎలా ప్రచారం చేస్తుంది..



Madhuyashki

ప్రభుత్వ ఆస్తులపై బీఆర్ఎస్ ఎలా ప్రచారం చేస్తుందన్నారు కాంగ్రెస్‌ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీ గౌడ్. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రభుత్వ భవనాల పై బీఆర్ఎస్ వాల్ పోస్టర్లు వేస్తున్నారన్నారు. ఎల్బీనగర్ నగర్ ఎమ్మెల్యే కాంగ్రెస్ కార్యకర్తల పై బెదిరింపులకు దిగుతున్నారని ఆయన వ్యాఖ్యానించారు. రేపు దీపావళి.. ఇంతవరకు ప్రభుత్వ టీచర్లకు జీతాలు రాలేదన్నారు మధు యాష్కీ. తలసాని తలకాయ లేని మాటలు మాట్లాడుతున్నారని, యాదవ కులస్థులు బర్లు కాచుకుంటూ బతుకుతున్నారు కానితలసాని కుమారులు మాత్రం రాజకీయాలు చేసుకోవాలా…? అని ఆయన ప్రశ్నించారు.

Also Read : Unstoppable with NBK : అన్ స్టాపబుల్ తరువాత ఎపిసోడ్ పై హింట్ ఇచ్చిన ఆహా టీం..

అంతేకాకుండా.. ‘నిన్న కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య ద్వారా బీసీ డిక్లరేషన్ ప్రకటించడం జరిగింది.. బీసీ సబ్ ప్లాన్ ద్వారా సంవత్సరానికి 20 వేల కోట్లు కాంగ్రెస్ ఖర్చు చేయబోతుంది.. రాహుల్ గాంధీ కుల గణన మద్దతు తెలిపారు ,మహిళా బిల్లులో రిజర్వేషన్లు ఉండాలని కూడా కోరారు .. బలహీన వర్గాలకు మంత్రిత్వ శాఖ కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేస్తుంది.. అర్హులైన బీసీ విద్యార్థులకు 10 లక్షల వరకు లోన్.. ఫ్రొ,, జయశంకర్ బీసీ ఐక్యతా భవన్ ల కోసం 50 కోట్ల ఖర్చు.. జనగామా జిల్లా పేరును సర్ధార్ సర్వాయి పాపన్న గౌడ్ జనగామ జిల్లా గా మార్పు.. బీజేపీ,బీఆరెస్ లో బీసీ ద్రోహులు..’ అని మధు యాష్కీ వ్యాఖ్యానించారు.

Also Read : Dal lake: ప్రసిద్ధ దాల్ సరస్సులో అగ్నిప్రమాదం.. హౌస్‌ బోట్లు కాలి ముగ్గురు మృతి