Leading News Portal in Telugu

Minister Harish Rao: మాలో మేమే దాడులు చేసుకుని సానుభూతి పొందాలని లేదు..



Minister Harish Rao

Minister Harish Rao: కొత్త ప్రభాకర్‌ రెడ్డిపై దారుణంగా దాడి చేశారని మంత్రి హరీశ్‌ మండిపడ్డారు. తర్వాత కోడికత్తి, కత్తిపోటు అంటూ హేళన చేశారని మంత్రి ఆవేదన వ్యకం చేశారు. గువ్వల బాలరాజుపై కాంగ్రెస్‌ నేతలు దాడి చేశారు.. గువ్వలపై కాంగ్రెస్ నేత వంశీకృష్ణ స్వయంగా రాళ్లు విసిరారని మంత్రి హరీశ్ వెల్లడించారు. ప్రశాంత్‌ కిషోర్‌ ఇప్పుడు మాకు వ్యూహకర్తగా లేరన్నారు. రేవంత్‌ భాషను చూసి ప్రజలు అసహ్యించుకుంటున్నారు.. రేవంత్ చిల్లరగా మాట్లాడుతున్నారని మంత్రి హరీశ్ అన్నారు. మాలో మేమే దాడులు చేసుకుని సానుభూతి పొందాలని లేదని హరీశ్ స్పష్టం చేశారు.

మైనార్టీల సంక్షేమం కోసం కృషి చేశామన్న మంత్రి హరీశ్‌.. మైనారిటీ జనాభా అధికంగా ఉన్న ప్రాంతాల్లో విద్య కోసం ప్రత్యేక చర్యలు చేపడుతున్నామన్నారు. ఎన్నికల్లో కాంగ్రెస్ మైండ్‌ గేమ్‌ ఆడుతోందని మంత్రి హరీశ్ పేర్కొన్నారు. నేనెంటో అందరికీ తెలుసు.. నా జీవితం తెరిచిన పుస్తకమని ఆయన తెలిపారు. మేం అధికారంలోకి వచ్చాక మతఘర్షణ, కత్తిపోట్లు లేవన్నారు.

ALso Read: Minister Harish Rao: కేటీఆర్‌ను ముఖ్యమంత్రిగా చేసినా అంగీకరిస్తా..

పొన్నాల వయస్సు, సీనియారిటీని చూసి గౌరవించి పార్టీలోకి తెచ్చుకున్నామన్నారు. కాంగ్రెస్‌ పదేళ్ల పాలనలో ఉచిత కరెంట్‌ ఉత్త కరెంట్‌గా మారిందన్నారు. కర్ణాటక తరహా పాలన తెలంగాణలో అవసరం లేదన్నారు. కటిక చీకటి కర్ణాటక మోడల్‌ తెలంగాణలో అక్కర్లేదన్నారు. కరెంట్‌ బిల్లులు పెంచిన ఘనత కాంగ్రెస్‌ పార్టీదేనని మంత్రి హరీశ్‌ వెల్లడించారు. సమస్యలేమైనా పార్టీలో అంతర్గతంగా చర్చించుకుంటామని మంత్రి తెలిపారు. బీజేపీతో బీఆర్‌ఎస్‌కు ఎలాంటి అనుబంధం లేదని.. బండి సంజయ్‌ మార్పు ఆ పార్టీ అంతర్గత వ్యవహారమన్నారు. బీఆర్‌ఎస్‌ మూడోసారి అధికారంలోకి వస్తుందని మంత్రి ధీమా వ్యక్తం చేశారు.