
తెలంగాణలో ఎన్నికల ప్రచారం పర్వం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ఎన్టీవీ నిర్వహిస్తోన్న క్వశ్చన్ అవర్‌లో నేడు మంత్రి మల్లారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మల్లారెడ్డి జర్నలిస్తులు సంధించిన ప్రశ్నలకు సమాధానంగా.. ‘ టీడీపీలో ఉన్నప్పుడు ఎంపీ సీటు వదులుకో, లేకపోతే నీ కాలేజీలు బంద్ చేయిస్తా అని బెదిరించాడు. ఎన్నికల అఫిడవిట్లో తప్పులుండొచ్చు.. వాటిని సరి చేసుకుంటా. చంద్రబాబును నా టాలెంట్‌తో ఇంప్రెస్ చేశా. చంద్రబాబును కలిసి మూడు టికెట్లు కావాలని అడిగా. నాలాంటి వాళ్లు కావాలని చంద్రబాబు రాజకీయాల్లో తీసుకున్నారు.
Also Read : Top Headlines @9PM : టాప్ న్యూస్
సోషల్ మీడియాలో నేను నెంబర్ వన్. సోషల్ మీడియాలో చిరంజీవి, పవన్ కల్యాణ్ కూడా నెంబర్‌వన్‌గా లేరు. మైనంపల్లి మెంటల్ మనిషి, రౌడీ. మైనంపల్లి ఒక్కసారి అసెంబ్లీకి రాలేదు. మైనంపల్లి జోకర్, పాగల్ అయిపోయాడు. రేవంత్ చేసిన గొప్ప పని ఏంటి.? ఆయన సీఎం అవ్వడానికి ఉన్న అర్హత ఏంటి.? రెడ్డి సంఘం మీటింగ్‌కు పోతే ఓ రెడ్డి మీద దాడి చేయిస్తారా.? నాకు డబ్బు అవసరం లేదు, నాకు ఫుల్ బ్యాంక్ బ్యాలెన్స్ ఉంది. ఐటీ దాడులు నాకు కొత్తేమి కాదు, మూడు సార్లు నాపై రైడ్స్ జరిగాయి. విచారణ పేరుతో నా కొడుకును అధికారులు మెంటల్ టార్చర్ పెట్టారు. చంద్రబాబు అరెస్ట్‌తో ఏడ్చాను. నాకు చంద్రబాబు రాజకీయ భిక్ష పెట్టారు. చంద్రబాబు ఏ తప్పు చేయలేదు, కావాలనే అరెస్ట్ చేశారు.’ అని మంత్రి మల్లారెడ్డి అన్నారు.
Also Read : Tammineni Sitaram: కులగణన కోసం శ్రీకాకుళం జిల్లా నుంచే శ్రీకారం..