Leading News Portal in Telugu

K. Laxman : కేసీఆర్‌ ఉద్యోగం ఊడటం ఖాయం


K. Laxman : కేసీఆర్‌ ఉద్యోగం ఊడటం ఖాయం

ఏ వర్గం కూడా బీఆర్‌ఎస్‌కు ఓటెయ్యడనికి ప్రజలు సిద్ధంగా లేరన్నారు బీజేపీ రాజ్యసభ సభ్యులు కె. లక్ష్మణ్‌. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కేసీఆర్ ఉద్యోగం ఊడటం ఖాయమన్నారు. సందట్లో సడేమియా లాగా కాంగ్రెస్ దూరుదమని ప్రయత్నం చేస్తున్నా కూడా ప్రజలు పట్టించుకోవడం లేదన్నారు. బీజేపీ ఈ ఎన్నికలు తెలంగాణ ప్రజల భవిష్యత్ ముడిపడి ఉన్న ఎన్నికగా ప్రజల్లో ఉంటున్నామన్నారు లక్ష్మణ్‌. యువత, నిరుద్యోగం ఇవే ప్రధాన సమస్యలు అని, ఆనాటి ఉద్యమం ఎలా కొనసాగిందో యువత ఇవ్వాళ కేసీఆర్‌ను ఓడించి బీజేపీ నీ గెలిపించాలని ఎదురుచూస్తున్నారన్నారు లక్ష్మణ్‌.

అంతేకాకుండా.. ‘ఉద్యోగాల కోసం ఎదురుచూసి బతుకు భారంగా మారి జీవచ్చం లా మారి బతుకుతున్నారు. కొలువుల కోసం వచ్చిన తెలంగాణ లో కొలువులు రాకుండా పోయాయి. 2014 నుంచి భర్తీ చేస్తామని చెప్పినా కూడా ఇంతవరకు ఆ దిశగా ప్రయత్నం చెయ్యలేదు. 3 లక్షల పైగా ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయి. పీఆర్‌ఎస్‌ నివేదిక కూడా ఇచ్చింది. 50 లక్షల పైగా నిరుద్యోగులు ఉన్నారు. ఒక్క గ్రూప్ కూడా వెయ్యలేదంటే కెసిఆర్ చిత్తశుద్ది అర్దం అవుతున్నది. ప్రభుత్వ పాఠశాలలు మూత పడుతున్నాయి, డీఎస్సీ వేసే పరిస్థితి లేదు. పది వేల మంది కాంట్రాక్ట్ ఉద్యోగులను మెడలు పంపి బయటకు పంపారు. కొత్త ఉద్యోగాలు ఇవ్వకపోగా ఉన్నవి ఊడ పీకిండ్రు. కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉండదని ప్రగల్భాలు పలికి మొహం చాటేశారు. ఉద్యోగం పోయిన cm కూతురు ను మాత్రం దొడ్డి దారిన ఉద్యోగం ఇచ్చారు. ట్విట్టర్ టిల్లు మాత్రం రెండు లక్షల ఉద్యోగాలు ఇచ్చామని గప్పలు కొడుతున్నాడు. ఉద్యోగం లేకపోతే నిరుద్యోగ భృతి అన్నారు.. ఏమైంది? ఒక్క రూపాయి కూడా ఎవరికీ ఇవ్వలేదు. తల్లిదండ్రులు కూడా ఆలోచన చెయ్యాలి. కొత్త జిల్లాలు, రెవెన్యూ, గ్రామ పంచాయతీ ల ఆధారంగా కొత్త ఉద్యోగాలు ఏవి? మొన్న ప్రవళిక ఆత్మహత్య కూడా ప్రేమ పేరు నెపం నెట్టారు.. వారి ఉసురు ఊరికే పోదు.

మీ పిల్లలు ఉద్యోగాలు చెయ్యాలా? ఉరికి పోవాల?. 50 వేల జీతం దోచుకొని 2000 పెన్షన్ ఇస్తున్నాడు. నిరుద్యోగుల కు కొలువు రావాలంటే కెసిఆర్ కొలువు పోవాల్సిందే. ప్రపంచం లో ఇంత అబద్దాల నాయకుడు ఎక్కడ లేడు. ఓటర్లు ఫూల్స్ కాదు.. షూటర్స్. అని నిరూపించుకునే సమయం ఆసన్నమైంది. అమిత్ షా రేపు హైదరాబద్ వస్తున్నారు, మానిఫెస్టో విడుదల చేస్తారు. 18 న గద్వాల, నల్గొండ, వరంగల్ లో బహిరంగ సభలు. హైదరాబాద్ లో mrps నాయకుల తో సమావేశం. కులగణన కు బీజేపీ వ్యతిరేకం కాదు బీసీ లకు న్యాయం జరిగే శాస్త్రీయత కోసమే మా ఆలోచన. రాష్ట్రాలకు కుల గణన విషయము లో మోడీ సర్కారు పూర్తి స్వేచ్ఛ ఇచ్చారు. బీసీ సీఎం అంటే సామాజిక న్యాయం.. అన్నీ వర్గాలకు నాయ్యం చెయ్యడమే. నాయకులు ఎవరి భవిష్యత్ కోసం వారు వెళ్తున్నారు కానీ బీజేపీ తెలంగాణ ప్రజల భవిష్యత్ కోసమే పని చేస్తున్నారు. పది సంవత్సరాల నిద్ర మత్తు తర్వాత ktr మెల్కొన్నడు. పదేండ్లు రేషన్ కార్డు కూడా ఇవ్వలేని కేటీఆర్ ను దేనితో కొట్టాలో ప్రజలు తెల్చుకుంటారు.
మోడీ మాత్రం 80 కోట్ల మందికి ఉచితంగా రేషన్ పంపిణీ చేస్తున్నారు..