
Nallala Odelu Comments on Balka Suman: చెన్నూర్ ఎమ్మెల్యే, బీఆర్‌ఎస్ అభ్యర్థి బాల్క సుమన్‌పై మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ నేత నల్లాల ఓదెలు సంచలన ఆరోపణలు చేశారు. శుక్రవారం మీడియా సమావేశంలో పాల్గొ ఆయన ఈ సందర్భంగా మాట్లాడారు. బాల్క సుమన్ తనని కొనేందుకు చూశాడంటూ షాకింగ్ విషయం చెప్పారు. ఇందుకోసం తనకు రూ. 20 కోట్లు ఆఫర్ చేసినట్టు తెలిపారు. బాల్క సుమన్‌కు ఓటమి భయం పట్టుకుందని, అందుకే తనని కొనాలని చూసినట్టు పేర్కొన్నారు.
రూ. 20 కోట్లు కాదు కదా రూ. 100 కోట్లు ఇచ్చినా తాను వివేక్‌ను వీడనని, ఈ నెల 30న కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి.. బాల్క సుమన్‌ను బట్టలూడతీసి ఇంటికి పంపించుడే అని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మనకు సంపూర్ణ స్వాతంత్ర్యం వచ్చినట్టేనని అన్నారు. మీరు వివేక్ వెంకట స్వామిని గెలిపించండి.. మీ అభివృద్ధి కోసం తాను అండగా ఉంటానంటూ చెన్నూరు ప్రజలకు నల్లాల ఓదేలు పిలుపునిచ్చారు. కాగా ఇటీవల బీఆర్‌ఎస్ పార్టీ రాజీనామ చేసిన నల్లాల ఓదేలు.. టీపీసీసీ ఛైర్మన్ రేవంత్‌రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన సంగతి తెలిసిందే.