Leading News Portal in Telugu

Minister Mallareddy: మంత్రి మల్లారెడ్డి అఫడవిట్‌పై పటిషన్‌.. కొట్టేసిన హైకోర్టు



Malla Reddy

మంత్రి మల్లారెడ్డి అఫిడవిట్‌ను సవాల్ చేస్తూ వేసిన పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది. మంత్రి మల్లారెడ్డి వేసిన నామినేషన్లో తప్పులు ఉన్నాయని, ఈ విషయాన్ని సంబంధిత రిటర్నింగ్‌ అధికారి దృష్టికి తీసుకువెళ్లిన పట్టించుకోలేదని అంజిరెడ్డి అనే వ్యక్తి హైకోర్టులో పటిషన్‌ దాఖలు చేశారు. మల్లారెడ్డి నామినేషన్‌ను తిరస్కరించేలా ఆదేశాలు జారీ చేయాలని అతను కోర్టు కోరారు. ఇక దీనిపై శనివారం విచారణ చేపట్టగా.. ఆఫిడవిట్‌లోని అభ్యంతరాలపై ఫిర్యాదు దారుడికి రిటర్నింగ్‌ అధికారి ఇప్పటికే సమాధానమిచ్చినట్టు ఎన్నికల కమిషన్‌ తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. దీంతో మంత్రి మల్లారెడ్డిపై వేసిన పటిషన్‌ హైకోర్టు కోట్టివేసింది.