Leading News Portal in Telugu

Amit Shah : కేటీఆర్‌ను సీఎం చేయడమే లక్ష్యంగా కేసీఆర్‌ పనిచేస్తున్నారు



Amit Sha

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు బీజేపీ మేనిఫెస్టోను అమిత్‌ షా విడుదల చేశారు. సకల జనుల సౌభాగ్య తెలంగాణ పేరిట మేనిఫెస్టోను విడుదల చేశారు. మన మోడీ గ్యారెంటీ.. బీజేపీ భరోసా ట్యాగ్ లైన్ తో మేనిఫెస్టోను అమిత్‌ షా వివరించారు. ఈ సందర్భంగా అమిత్‌ షా మాట్లాడుతూ.. తెలంగాణ ఇచ్చేందుకు కాంగ్రెస్ ఎంతో మంది యువకులను బలితీసుకుందన్నారు. తెలంగాణ ఇచ్చేందుకు అంగీకరించలేదని, 2004 నుంచి 2014 వరకు ఉమ్మడి రాష్ట్రానికి 2 లక్షల కోట్లు ఇచ్చారు. బీజేపీ అధికారంలోకి వచ్చాక కేవలం తొమ్మిదిన్నరేళ్లలో ఒక్క తెలంగాణకే రెండున్నార లక్షల కోట్లు నిధులు కేటాయించామన్నారు అమిత్‌ షా. అంటే 160 శాతం రేట్లు అధికంగా కేటాయించామని, తెలంగాణకు గిరిజన వర్సిటీని మోడీ అందించారన్నారు అమిత్‌ షా.

అంతేకాకుండా.. ‘నేషనల్ టర్మరిక్ బోర్డు ఏర్పాటు చేస్తున్నాం. వందే భారత్ ట్రైన్లు తెలంగాణకు ఇచ్చాము. నేషనల్ హైవేలు, గ్రీన్ ఫీల్డ్ హైవేలు ఏర్పాటు చేశాం. హైదరాబాద్ మెట్రోకు 1200 కోట్ల కంటే ఎక్కువ నిధులు ఇచ్చాం. కేసీఆర్ పార్టీ ప్రజలకు ఏం చేసింది. కేసీఆర్.. గతంలో తెలంగాణ విమోచన దినోత్సవం ఏర్పాటు చేయాలని చెప్పి ఇప్పుడు మాత్రం నిర్వహించడం లేదు. ఒవైసీకి భయపడి నిర్వహించడం లేదు. లోకతంత్రం వదిలి.. లూట్ తంత్రాన్ని నమ్ముకుని పనిచేస్తున్నారు. కుటుంబ పాలనకు పరిమితమయ్యారు. కేటీఆర్ ను సీఎం చేయడమే లక్ష్యంగా ఆయన పనిచేస్తున్నారు. నీళ్లు, నిధులు, నియమకాల పేరిట తెలంగాణ ఏర్పాటు కోసం పోరాడితే.. అవి అమలు కాలేదు. కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగింది. పాలమూరు రంగారెడ్డి పెండింగ్ లో ఉంది. మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రాన్ని 7.5 లక్షల కోట్ల అప్పుల్లో నెట్టారు. ప్రతి ప్రాజెక్టులో వీరికి కమీషన్లు ఇవ్వాలి. 17 సార్లు పేపర్ లీక్ అయింది. ఎందరో మంది ఆత్మహత్య చేసుకున్నారు. సమయానికి జీతాలు ఇవ్వడం లేదు.
స్కూళ్ళు, కాలేజీల్లో ఖాళీలు భర్తీ చేయలేదు. కేసీఆర్ ఇచ్చిన హామీలు పూర్తిగా విస్మరించారు. లోన్లు మాఫీ చేస్తామని మోసం చేశారు.

 

డబుల్ ఇండ్లు ఇవ్వలేదు. సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ కట్టలేదు. కేసీఆర్.. పార్టీ.. అభివృద్ధి వ్యతిరేక పార్టీ. కేసీఆర్ రెండుసార్లు సీఎం అయ్యారు.. వారు అధికారంలోకి రారు.. అయినా కేటీఆర్ ను సీఎం చేయాలని కేసీఆర్ కలలు కంటున్నారు. లిక్కర్, గ్రానైట్, మిషన్ కాకతీయ.. ఇలా ప్రతి పథకంలో అవినీతికి పాల్పడ్డారు. అవినీతి చేయాలంటే.. ఎవరైనా భయపడుతారు. కానీ కేసీఆర్.. అవినీతి చేసి.. చేసి.. అలవాటు పడిపోయారు.. ముస్లిం రిజర్వేషన్లు తొలగించి వాటిని ఎస్సి, ఎస్టీ, బీసీలకు ఇస్తాం. అవినీతి చేసేందుకు ఏమాత్రం భయపడటం లేదు. కేసీఆర్.. కారు స్టీరింగ్.. ఒవైసీ చేతిలో ఉంది. 10 ఏండ్లలో.. ఎలాంటి అభివృద్ధి చేపట్టలేదు. తాంత్రికులు చెప్పారని.. కేసీఆర్ పార్టీ పేరు మార్చాడు. తాంత్రికులు చెప్పినట్లుగా వారి సలహాల మేరకు కేసీఆర్ నడుచుకుంటున్నారు. యాక్షన్ తీసుకోవడం బీజేపీ పనికాదు.

 

కేసీఆర్ అవినీతిపై దర్యాప్తు సంస్థలు యాక్షన్ తీసుకుంటాయి. సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జికి కూడా సిఫారసు చేస్తాం. ధరణి పోర్టల్ భూకుంభకోణాలపై కూడా విచారణ చేపడుతాం. బీజేపీ బీహార్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ ను విభజించాము.. కానీ ఎక్కడా రక్తపాతం జరగలేదు. ఓడిపోయే వాళ్ళు ఓడిపోతామని ఒప్పుకోరు కదా.. అందుకే మేమే గెలుస్తామని చెప్పుకుంటున్నారు. కట్టలు కట్టలు డబ్బులు దొరుకుతున్నాయి.. వాటిపై కేసీఆర్, కాంగ్రెస్ ను ప్రశ్నించాలి. ఆ డబ్బులన్నీ తెలంగాణ ప్రజలవి.. వారంతా ప్రశ్నించాలి. గ్యాస్ సిలిండర్ల తగ్గింపు అంశంపై రాష్ట్ర, కేంద్ర సర్కార్ రెండు కలిసి తగ్గిస్తే.. పేదలపై భారం పడదు.. కేసీఆర్ ఎందుకు తగ్గించడం లేదు. బీసీ ముఖ్యమంత్రి నినాదంతో బీజేపీ వెళ్తోంది.. అందుకే.. రాజగోపాల్ రెడ్డి, విజయశాంతి, వివేక్ పార్టీ మారారు. వాళ్ళ కోసం మేము మా విధానాలు మార్చుకోలేం కదా. కేసీఆర్ మా పార్టీలో కోవర్టులు ఉన్నారంటున్నాడు.. మరి కేసీఆర్ కూడా టీడీపీ వ్యక్తే కదా. డిసెంబర్ 3 తర్వాత ప్రభుత్వం ఫామ్ చేసేది ఎవరో చూస్తారు.’ అని అమిత్‌ షా వ్యాఖ్యానించారు.