Leading News Portal in Telugu

Amit Shah: రేపు మరోసారి తెలంగాణలో అమిత్ షా పర్యటన..



Amit Shah

Amit Shah: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు మరికొన్ని రోజుల మాత్రమే మిగిలి ఉన్నాయి. నవంబర్ 30న పోలింగ్ జరగనుంది. ఈ నేపథ్యంలో అన్ని పార్టీలు కూడా ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. అధికార బీఆర్ఎస్ పార్టీతో సహా కాంగ్రెస్, బీజేపీలు నియోజకవర్గాల వారీగా పర్యటనలు జరుపుతున్నారు. తమ స్టార్ క్యాంపెనర్లను రంగంలోకి దించుతున్నారు. హమీలతో ప్రజల్ని ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణలో ఈ సారి బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీల మధ్య ముక్కోణపు వార్ నెలకొంది.

Read Also: Raviteja : తనని స్టార్ హీరోని చేసిన ఆ సినిమా కు రవితేజ మొదటి ఛాయిస్ కాదా ..?

ఇదిలా ఉంటే బీజేపీ తరుపున కేంద్ర నాయకత్వం తెలంగాణలో పర్యటిస్తోంది. ఇప్పటికే ప్రధాని మోడీ ఇటీవల మందకృష్ణ మాదిగ నిర్వహించిన బహిరంగ సభకు హాజరయ్యారు. తన మద్దతు ప్రకటించారు. ఇదిలా ఉంటే కేంద్ర హోంమంత్రి అమిత్ షా వరసగా తెలంగాణలో పర్యటిస్తున్నారు. రేపు మరోసారి తెలంగాణ పర్యటనకు రాబోతున్నారు. రేపు సాయంత్రం ఉప్పల్ లో జరిగే రోడ్ షోలో అమిత్ షా పాల్గొంటారు.

రేపు మధ్యాహ్నం 12.35 గంటలకు బేగంపేట విమానాశ్రయానికి చేరుకుని, అక్కడ నుంచి 1 గంటకు జనగామలో జరిగే పబ్లిక్ మీటింగ్‌కి హాజరవుతారు. అక్కడి నుంచి 2.45 గంటలకు కోరుట్ల చేరుకుంటారు. మధ్యాహ్నం 3 గంటలకు నుంచి 3.40 వరకు సభలోనే ఉంటారు. కోరుట్ల నుంచి 4.45 గంటలకు తిరిగి బేగంపేట విమానాశ్రయానికి చేరుకుని, సాయంత్రం 5.30 గంటల నుంచి 7 గంటల వరకు రోడ్ షోలో పాల్గొంటారు. రోడ్ షో ముగిశాక రాత్రి 8.10 గంటలకు ఢిల్లీకి పయనం అవుతారు.