
కేటీఆర్ ఐటీలో కింగ్ అంటారు.. ఉద్యోగాలు మాత్రం ఇవ్వరు
మంత్రి కేటీఆర్ ఐటిలో కింగ్ అంటారు.. ఉద్యోగాలు మాత్రం ఇవ్వరు అంటూ కేంద్ర మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు రేణుకా చౌదరి ఫైర్ అయ్యారు. గెలుపు తధ్యం అనేది జగమెరిగిన సత్యమని ఎవరెన్ని ఇబ్బందులు పెట్టినా గెలిచేది కాంగ్రెస్ అన్నారు. 10కి 10 స్థానాలు గెలుస్తున్నామని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఉద్యోగ నోటిఫికేషన్ లు పదేపదే వాయిదాలు ఎందుకు పడుతున్నాయన్నారు. ఇది ప్రభుత్వ అసమర్థత కాదా? అని ప్రశ్నించాఉ. నిరుద్యోగుల తల్లిదండ్రుల భాద వర్ణనాతీతమన్నారు. దేశ భవిష్యత్తులో భాగస్వాములు కావాల్సిన యువత ఉద్యోగాలు లేక పెడదారి పడుతున్నారని అన్నారు. రాష్ట్ర స్థాయిలో కాంగ్రెస్ కు ఊహించని ఆదరణ లభిస్తోందన్నారు. ఇతర రాష్ట్రాలు, జిల్లాలనుంచి ఆహ్వానిస్తున్నారు కాంగ్రెస్ ను అన్నారు. పరిపాలన దిగజారినపుడు ప్రజలు కాంగ్రెస్ వైపు చూస్తున్నారని తలిపారు. ఏది ఏమైనా ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి రాబోతుందని ధీమా వ్యక్తం చేశారు. కారుగుర్తు రద్దు కాబోతుందని సంచలన వ్యాఖ్యలు చేశారు. అధికార పార్టీ నేతలు అధికార మదంతో విర్రవీగుతున్నారని మండిపడ్డారు. అవన్నీ మాకు బలంగా మారుతున్నాయన్నారు.
తెలంగాణ ప్రజలను కాంగ్రెస్ మభ్యపెడుతోంది: కర్ణాటక మాజీ మంత్రి
కాంగ్రెస్ ఆరు గ్యారెంటటీలంటూ తెలంగాణ ప్రజలను మభ్యపెడుతుందని కర్ణాటక మాజీ డిప్ఊటీ సీఎం, బీజేపీ నేత అశ్వత్ నారాయణ అన్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బీజీపీ పార్టీ తరపున ఆయన రాష్ట్రంలో పర్యటించారు. ఈ సందర్భంగా సోమవారం బీజేపీ సభలో ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీపై విమర్శలు గుప్పించారు. కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని, అక్కడ ఇచ్చిన ఏ హామీనీ కాంగ్రెస్ నిలబెట్టుకోలేదని అన్నారు. ఆర్భాటంగా ప్రకటించిన ఏ హామీని కాంగ్రెస్ నిలబెట్టుకోలేదన్నారు. అమలుసాధ్యం కాని హామీలు, మోసపూరిత మాటలతో అక్కడ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని మండిపడ్డారు.
తెలంగాణలో పవన్ ప్రచారం.. ఈనెల 22న వరంగల్ లో రోడ్ షో..?
ఉమ్మడి వరంగల్ జిల్లాపై ఇప్పటికే దృష్టి సారించిన బీజేపీ.. ఈ నెల 22న వరంగల్ లో ప్రచారానికి పవన్ కల్యాణ్ ను పంపుతోంది. దీంతో పాటు వీలైతే వరంగల్ పశ్చిమతోపాటు తూర్పు నియోజకవర్గంలో కూడా రోడ్ షోలు నిర్వహిస్తామని పార్టీ కార్యకర్తలు చెబుతున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో 12 నియోజకవర్గాలు ఉండగా.. గెలిచే అవకాశాలున్న స్థానాలపై బీజేపీ గట్టి ఫోకస్ పెట్టింది. అధికార యంత్రాంగం కూడా ఇక్కడి అభ్యర్థులతో ఎప్పటికప్పుడు చర్చలు జరుపుతూ… జనాల్లో పార్టీ గ్రాఫ్ పడిపోకుండా జాగ్రత్తలు కూడా తీసుకుంటున్నారు. ఇందులోభాగంగా పార్టీ అగ్రనేతలను అవసరమైన నియోజకవర్గాలకు పంపుతోంది. ఇప్పటికే మేనిఫెస్టో విడుదల చేసి ప్రచారం కూడా ముమ్మరం చేయగా.. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఉమ్మడి జిల్లాలో నిరంతరం సమావేశాలు నిర్వహిస్తున్నారు. వరంగల్ తూర్పు, పశ్చిమ, వర్ధన్నపేట, పరకాల, నర్సంపేట నియోజకవర్గాలకు సంబంధించి ఈ నెల 18న ఖిలా వరంగల్‌లో ‘సకల జనుల విజయ సంకల్ప సభ’ పేరిట భారీ బహిరంగ సభ నిర్వహించారు. అమిత్ షా ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. రాష్ట్ర ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు ప్రతి కార్యకర్త కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఇవాళ అమిత్ షా మరోసారి ఉమ్మడి జిల్లాలోకి అడుగుపెట్టనున్నారు. జనగామ నియోజకవర్గ కేంద్రంలో నిర్వహించే విజయ సంకల్ప సభకు హాజరవుతారు.
పవన్ కల్యాణ్‌కు సీఎం పోస్ట్‌పై వైసీపీ ఎంపీఆసక్తికర వ్యాఖ్యలు.. కాపు సోదరులు గమనించాలి..!
ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ-జనసేన కలిసి ముందకు నడుస్తున్నాయి.. అయితే, సీఎం అభ్యర్థి ఎవరు అనేది వచ్చే సీట్లను భట్టి.. పరిస్థితులను బట్టి నిర్ణయం తీసుకుంటారని ఓవైపు.. మళ్లీ సీఎం అయ్యేది చంద్రబాబే అనే చర్చ మరోవైపు నడుస్తోంది.. అయితే, పవన్ కల్యాణ్.. సీఎం అభ్యర్థిపై రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.. అసలు పవన్ కల్యాణ్ ముఖ్యమంత్రి అభ్యర్థేకాదన్న ఆయన.. కాపు సోదరులు ఈ విషయాన్ని గమనించాలని విజ్ఞప్తి చేశారు.. ఇక, రాష్ట్రంలో గతంలో ఎప్పుడూ కులగణన పూర్తిస్థాయిలో జరిగిన దాఖలు లేవు.. ప్రతి కులానికి ఎంత మంది జనాభా వున్నారు, అందరికీ ఫలాలు అందుతున్నాయా లేదా అన్న విషయం కులగణన ద్వారా తెలుసుకోవచ్చు.. అందరికీ అభివృద్ధి సంక్షేమ ఫలాలు సమానంగా అందించవచ్చు.. కులగుణనకు సంబంధించి మొదటి రౌండ్ టేబుల్ సమావేశం రాజమండ్రిలోనే నిర్వహించారు. బీసీ సంఘాల నేతలు నుంచి అన్ని కులాల కుల సంఘాల దగ్గరనుంచి అభిప్రాయాలు సేకరించాం.. టీడీపీ నేత యనమల ఇతర నేతలు జయహో బీసీ పేరుతో సమావేశం పెట్టడం దారుణం అన్నారు.
టీడీపీకి కొడాలి నాని సవాల్.. అది నిరూపిస్తే రాజకీయాలకు గుడ్‌బై..!
టీడీపీ నేతలకు సవాల్ విసిరారు మాజీ మంత్రి, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని.. కృష్ణా జిల్లా గుడివాడలో ముస్లిం సంచారజాతుల బీసీ(ఈ) కుల ధ్రువీకరణ పత్రాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. ముస్లిం సోదరులకు ధ్రువీకరణ పత్రాలు పంపిణీ చేశారు.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గుడివాడ గురించి చంద్రబాబు, టీడీపీ పకోడీగాళ్లు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు. గుడివాడ నియోజకవర్గ ప్రజల త్రాగునీటి అవసరాలు, నివాస స్థలాల కోసం టీడీపీ హయంలో ఒక్క ఎకరా సేకరించినట్లు నిరూపిస్తే ఎన్నికల్లో పోటీ చేయకుండా, రాజకీయాలనుండి తప్పుకుంటానని ఛాలెంజ్ చేశారు.. సీఎంలుగా వైఎస్ఆర్, వైఎస్ జగన్.. గుడివాడ ప్రజల అవసరాల కోసం 625 ఎకరాల భూములు కొన్నారు. గుడివాడలో తన బంధువులు ఉన్నారని చెప్పుకునే చంద్రబాబు… 14ఏళ్లు సీఎంగా ఉండి ఏం చేశాడు..? అని నిలదీశారు.
ఆటో డ్రైవర్లకు కేసీఆర్ గుడ్ న్యూస్.. ఆ పన్ను రద్దు చేస్తామని ప్రకటన..
తెలంగాణలోని ఆటో డ్రైవర్లకు తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు శుభవార్త అందించారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్‌ఎస్ ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి వస్తే ఆటో సంబంధిత ఫిట్‌నెస్ ఫీజులు, సర్టిఫికెట్ల జారీ ఫీజులను మాఫీ చేస్తామని ప్రకటించారు. మానకొండుర్ నియోజకవర్గం తిమ్మాపూర్ లో ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొన్న సీఎం కేసీఆర్ కొత్త హామీ ఇచ్చారు. అధికారంలోకి రాగానే ఆటో ఫిట్ నేస్ ఛార్జీలు రద్దు చేస్తామని ఆటో రిక్షా వాళ్లకు శుభవార్త చెప్పారు. దేశంలో ప్రజాస్వామ్యం వచ్చి 75 సంవత్సరాలు గడిచిన మనకు ఇంకా అవి అమలు కావడం లేదని తెలిపారు. ప్రజలంతా మీ ఆయుధం ఓయు హక్కు దానిని మంచి వ్యక్తికి వేసి గెలిపించాలన్నారు. అభ్యర్థి మాత్రమే కాదు పార్టీల గురించి కూడా ఆలోచన చేయాలన్నారు. బీఆర్ఎస్ పార్టీ పుట్టిందే తెలంగాణ కోసం తెలంగాణ ప్రజల కళను సాకారం చేసిన పార్టీ అన్నారు. కాంగ్రెస్ నాయకులు ఇందిరమ్మ రాజ్యం అంటున్నారు.. అప్పటి పాలన ఎలా ఉందో ఒక్కసారి గమనించాలన్నారు. ఇందిరమ్మ రాజ్యం బాగుంటే ప్రజలంతా అప్పుడు ఎన్టీఆర్ పెట్టిన టిడిపి పార్టీని ఎందుకు ఆదరించారని తెలిపారు. తెలంగాణను ఆంధ్రాలో కలిపింది కాంగ్రెస్ పార్టీ కదా 58 ఎండ్లు తెలంగాణ కోసం పోరాటం చేశామన్నారు. 2004లో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ అప్పుడు తెలంగాణ ఇయ్యలే అన్నారు. మన తెలంగాణ కోసం 33 పార్టీల మద్దతు ప్రకటించారని తెలిపారు. రాష్ట్ర సాధన కోసం కోసం యావత్ తెలంగాణ లోకం ఉద్యమాలు చేశాయని తెలిపారు.
చంద్రబాబుకు బిగ్ రిలీఫ్.. పూర్తిస్థాయి బెయిల్ మంజూరు చేసిన హైకోర్టు
టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు హైకోర్టులో భారీ ఊరట లభించింది.. ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో చంద్రబాబుకు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసింది ఏపీ హైకోర్టు.. స్కిల్ కేసులో ఆగస్టు 9వ తేదీన చంద్రబాబును అరెస్ట్ చేసింది ఏపీ సీఐడీ.. అయితే, రాజమండ్రి సెంట్రల్ జైలులో 50 రోజులకు పైగా ఆయన రిమాండ్‌లో ఉండగా.. అనారోగ్యకారణాల దృష్ట్యా.. అక్టోబర్ 31వ తేదీన చంద్రబాబుకు నాలుగు వారాల పాటు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది హైకోర్టు.. మధ్యంతర బెయిల్‌పై ఇప్పటికే ఆయన బయట ఉండగా.. ఇప్పుడు పూర్తిస్థాయిలో బెయిల్ మంజూరు చేసింది హైకోర్టు.. స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో చంద్రబాబు బెయిల్ పిటిషన్‌పై ఈ నెల 17వ తేదీన వాదనలు ముగించింది కోర్టు.. చంద్రబాబు తరఫున సీనియర్ న్యాయవాదులు సిద్ధార్థ లూథ్రా, దమ్మాలపాటి శ్రీనివాస్.. సీఐడీ తరఫున అదనపు ఏజీ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి వాదనలు వినిపించారు. అయితే, తీర్పును రిజర్వ్ చేసిన హైకోర్టు.. అయితే, ఈ రోజు చంద్రబాబుకు పూర్తిస్థాయిలో బెయిల్ మంజూరు చేస్తూ తీర్పు వెల్లడించింది.. ఈ నెల 28న రాజమండ్రి సెంట్రల్ జైలుకు వెళ్లాల్సిన అవసరం లేదని తెలిపారు. అయితే ఈ నెల 30న ఏసీబీ కోర్టు ముందు చంద్రబాబు హాజరుకావాలని ఆదేశించింది హైకోర్టు.. అయితే, హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టుకు వెళ్లే యోచనలో ఏపీ సీఐడీ ఉన్నట్టుగా తెలుస్తోంది. మరి సుప్రీంకోర్టులో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో వేచిచూడాల్సి ఉంది.
బీఆర్ఎస్, ఎంఐఎం, కాంగ్రెస్ కుటుంబ పార్టీలు..
జనగామ జిల్లా కేంద్రంలోని ప్రెస్టన్ మైదానంలో జరిగిన సభలో బీజేపీ విజయ సంకల్ప సభలో కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా మాట్లాడుతూ.. బైరాన్ పల్లిలో రజాకార్ల చేతిలో అమరులైన వారికి నివాళులర్పిస్తున్నామని చెప్పారు. అసదుద్దీన్ ఓవైసీ, ఇతర నాయకులకు భయపడి కేసీఆర్ సెప్టెంబర్ 17 విమోచన దినోత్సవాన్ని విస్మరించారు అని వ్యాఖ్యానించారు. తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడితే తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించి చూపెడతామని ఆయన కామెంట్స్ చేశారు. బైరాన్ పల్లిలో అమరుల స్మారక స్థూపాన్ని నిర్మిస్తాం.. గత ఎన్నికలలో కేసీఆర్ ఇచ్చిన పాలిటెక్నిక్ కళాశాల హామీ నెరవేర్చలేదు.. అప్పుడున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యే, ఇప్పుడు వచ్చిన బీఆర్ఎస్ అభ్యర్థి భూ కబ్జాలకు పాల్పడే వాళ్ళు అని అమిత్ షా విమర్శలు గుప్పించారు.
ప్రభుత్వ కార్యాలయంలో ప్రార్థనలు.. ఉద్యోగిపై సస్పెన్షన్ వేటు
ప్రభుత్వ కార్యాలయంలో ఉన్న దుష్టశక్తులను తొలగించాలంటూ ప్రభుత్వ ఉద్యోగులతో క్రైస్తవ మత ప్రార్థనలు చేయించాడో అధికారి. ఈ ఘటన కేరళలోని త్రిస్సూర్ చిన్నారుల సంరక్షణ కార్యాలయంలో జరిగింది. దీనిపై దర్యాప్తు చేయాలని సబ్ కలెక్టర్‌ను ఆదేశించినట్లు కలెక్టర్ కృష్ణతేజ తెలిపారు. గత నెలలో కార్యాలయంలోని ఉద్యోగులందరినీ అత్యవసర సమావేశం కావాలని ఆదేశించిన ఓ అధికారి.. బైబిల్ చేతిలో పట్టుకుని ప్రార్థన చేపట్టారు. కార్యాలయంలో దుష్టశక్తులు ఉన్నాయని.. వాటిని తొలగించాలని ప్రార్థనలు చేయాలని ఉద్యోగులకు సూచించాడు. అంతా ఒప్పంద ఉద్యోగులు కావడం వల్ల ఎవరూ నోరు మెదపలేదు. ఈ వ్యవహారం కలెక్టర్ దృష్టికి రావడంతో ఘటనపై విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని జిల్లా కలెక్టర్ కృష్ణతేజ ఈనెల 11న సబ్ కలెక్టర్‌ను ఆదేశించారు.
టాయిలెట్ గదిలో దెయ్యం వేషంలో ఓ వ్యక్తి.. వీడియో చూస్తే షాక్..!
మీరు రాత్రిపూట టాయిలెట్‌కి వెళ్లి అకస్మాత్తుగా ఎవరైనా మీ వెనుక నిలబడితే ఎలా ఉంటుంది.. ఒక్కసారి ఊహించుకోండి. ఒక్కసారి ప్రాణాలు పోయేంత పని అవుతుంది. నిజంగానే గుండె సమస్యలు ఉన్నట్లైతే ప్రాణాలు కూడా పోవచ్చు. మాములుగా ఒంటరిగా హర్రర్ సినిమాలు చూస్తేనే.. కింది నుండి కారిపోతుంది. అలాంటిది చీకటి గదిలోకానీ, టాయిలెట్లలో ఏదో ఒక భయంకరమైన రూపం ఉంటే చాలా భయపడిపోతాం. అయితే ఇప్పుడు.. అలాంటి వీడియోనే సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ఒక వ్యక్తి టాయిలెట్‌కు వెళతాడు. అందులో దెయ్యం రూపంలో భయంకరంగా ఓ వ్యక్తి ఉంటాడు. అది ఊహించని ఆ వ్యక్తి.. టాయిలెట్ లోకి వెళ్లి దాన్ని చూసి భయపడతాడు.
ఈ వీడియోలో.. ఒక వ్యక్తి రాత్రిపూట టాయిలెట్‌లోకి వెళ్తుండటాన్ని చూడవచ్చు. అక్కడ తెల్లటి దుస్తులు చుట్టుకొని దెయ్యం రూపంలో తలుపు చాటుకుని నిలబడి ఉంది. అందులోకి వెళ్లిన వ్యక్తికి.. తన వెనుక ఎవరో నిలబడి ఉన్నారని తెలియదు. కొంత సమయం తర్వాత.. దెయ్యం అతని దగ్గరికి వెళ్లి ఏదో చెప్పాలని చూస్తుండగా.. ఆ వ్యక్తి దాని వైపు చూస్తాడు. ఇంకేముంది.. దానిని చూసిన వ్యక్తికి గుండె ఆగినంత పని అవుతుంది. భయం భయంగా ఎటు వెళ్లాలో అర్ధంకాక.. దానిని చూసి అరుస్తాడు. ఆ అరుపులకు దెయ్యం కూడా భయపడుతుంది.
అక్రమ కేసులపై మా పోరాటం ఫలించింది.. త్వరలోనే ప్రజా క్షేత్రంలోకి చంద్రబాబు
స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకి బెయిల్ రావడంతో ఏపీ టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు రియాక్ట్ అయ్యారు. చంద్రబాబుకి రెగ్యులర్ బెయిల్ రావడం సంతోషకరమని ఆయన తెలిపారు. న్యాయస్థానాలపై మాకు పూర్తి నమ్మకంతోనే ఇన్ని రోజులు అక్రమ కేసులపై పోరాటం చేశామన్నారు. తప్పుడు కేసులు న్యాయాస్థానాల ముందు నిలబడవని జగన్ రెడ్డి ప్రభుత్వం ఇప్పటికైనా తెలుసుకోవాలి అని అచ్చెన్న పేర్కొ్న్నారు. కోర్టులను తప్పుదారి పట్టించే ప్రయత్నాన్ని ఏపీ సీఐడీ మానుకోవాలి అని ఆయన సూచించారు. జగన్ రెడ్డి కళ్లలో ఆనందం కోసం ఇప్పటికీ సీఐడీ బుకాయించడం సిగ్గుచేటు అంటూ ఏపీ టీడీపీ అధ్యక్షుడు మండిపడ్డారు.
బీజేపీకి ఓటు వేసినా.. మోరిలో వేటు వేసిన ఒకటే
బీజేపీకి ఓటు వేసినా.. మోరిలో ఓటు వేసిన ఒకటే అని ఆర్థిఖ శాఖ మంత్రి హరీష్ రావు వ్యాఖ్యానించారు. సోమవారం గజ్వేల్‌లో జరిగిన బీఆర్‌ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా హరీష్ రావు ప్రతిపక్షాలపై ధ్వజమెత్తారు. ఈటెల రాజేందర్ తిన్నింటి వాసాలు లెక్కబెట్టారని, అన్నం పెట్టిన చెయ్యికి సున్నం పెట్టిండని మండిపడ్డారు. ఈటెలను ఎమ్మెల్యే చేసింది, మంత్రిని చేసింది.. శాసన సభ పక్ష లీడర్‌ను చేసింది సీఎం కేసీఆర్ అని గుర్తు చేశారు.
తిన్నింటి వాసాలు లెక్కపెట్టిన ఈటెలను ఓడించి బుద్ది చెప్పాలని గజ్వేల్ ప్రజలకు ఆయన పిలుపునిచ్చారు. రేవంత్ రెడ్డి మన ప్రొఫెసర్ జయశంకర్ సారును కించపరిచేలా మాట్లాడారన్నారు. నీళ్లు, నిధులు నియామకాలు నినాదం లేదంటూ మాటలు పడేసుకున్నాడని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక బీజేపీ-కాంగ్రెస్ రెండు తొడుదొంగలని విమర్శించారు. ఈసారి కేసీఆర్‌ను హ్యాట్రిక్ సీఎం గెలిపిస్తే గజ్వేల్ పేరు మరోసారి మారు మోగుతుందని హరీష్ రావు పేర్కొన్నారు.