
మహేశ్వరం నియోజకవర్గం సరూర్ నగర్ డివిజన్ లో ఇవాళ ఎన్నికల ప్రచారం నిర్వహించారు బీజేపీ అభ్యర్థి అందెల శ్రీరాములు యాదవ్. లక్ష్మీనగర్, SBI కాలనీ, విజయపురి కాలనీ, చావిడి కాలనీల్లో ఇంటింటి ప్రచారం చేశారు. మహిళలు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు సిద్దూ ముదిరాజ్, రంగారెడ్డి జిల్లా నాయకులు ఆరుట్ల సురేష్, బాణాల ప్రవీణ్ సహా డివిజన్ నాయకులు పాల్గొన్నారు. అనంతరం కందుకూర్ మండలం జైత్వారం, తిమ్మాపురం, దెబ్బడగూడ గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో మండల అధ్యక్షులు అశోక్ గౌడ్, కన్వీనర్ ఏల్మేటి దేవేందర్ రెడ్డి ఆధ్వర్యంలో పెద్ద సంఖ్యలో బీజేపీలో చేరారు.
Nirmala Sitaraman: అన్ని విధాలుగా రాష్ట్రాన్ని కేసీఆర్ భ్రష్టు పట్టించారు
ఈ సందర్భంగా కాషాయం కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు అందెల శ్రీరాములు యాదవ్. తెలంగాణ హైకోర్టు అడ్వకేట్స్ జేఏసీ సభ్యులు అందెల శ్రీరాములును కలిసి మద్దతు తెలిపారు. బీసీ ముఖ్యమంత్రి, బీసీ అభ్యర్థికి ఇవ్వటం వల్ల బీజేపీకి తమ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నట్లు రాష్ట్ర అడ్వకేట్స్ జేఏసీ అధ్యక్షులు నాగుల శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. ఎస్సీ వర్గీకరణకు దేశ ప్రధాని నరేంద్రమోడీ గారు కమిటీ వేస్తామని హామీ ఇచ్చారని.. అందువల్ల ఎస్సీ, బీసీలందరూ శ్రీరాములుకు ఓటు వేసి అత్యధిక మేజార్టీ ఇవ్వాలని కోరారు న్యాయవాదులు. ఈకార్యక్రమంలో మహేశ్వరం నియోజకవర్గం ప్రజాప్రతినిధులు, బీజేపీ, బీజేవైఎం, మహిళా మోర్చా నాయకులు పాల్గొన్నారు.
Bandi Sanjay: అందుకే వద్దని చెప్పా.. కేంద్ర మంత్రి పదవిపై బండి ఆసక్తికర వ్యాఖ్యలు..