టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ జూబ్లీహిల్స్ బోరబండలో రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. బోరబండ ప్రాంతం ఒకప్పుడు ఖైరతాబాద్ నియోజకవర్గంలో ఉండేదని, అన్నా అంటే నేనున్నా అని పీజేఆర్ ఆనాడు మీకు అండగా ఉన్నారన్నారు. ఇప్పుడు మీ కోసం కొట్లాడటానికి.. మీకు అండగా ఉండేందుకు కాంగ్రెస్ నాయకులు ఉన్నారని, ఇక్కడ రౌడీ మూకలు కాంగ్రెస్ కార్యకర్తలపై దాడులకు దిగుతున్నారట అని ఆయన వ్యాఖ్యానించారు. జాగ్రత్త… వచ్చేది మా ప్రభుత్వం.. ఒక్కొక్కరి మక్కెలు విరుగుతాయని ఆయన హెచ్చరించారు. రౌడీయిజాన్ని ఉక్కుపాదంతో అణచివేసింది కాంగ్రెస్ అని రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. అందుకే హైదరాబాద్ నగర ప్రజలు శాంతి భద్రతల సమస్య లేకుండా ప్రశాంతంగా ఉంటున్నారని, బోరబండకు ఒక స్మశానవాటిక ఏర్పాటు చేయని సన్నాసులు… మళ్లీ ఓట్లు అడగడానికి వస్తుండ్రు అని ఆయన మండిపడ్డారు.
Also Read : Bigg Boss 7 Telugu: ఎవిక్షన్ పాస్.. రైతు బిడ్డకే.. మరి ఆమె కోసం వాడతాడా.. ?
ఏ రాత్రి కష్టం వచ్చినా ఒక్క సీటీ కొట్టండి మీకు అండగా ఉండేందుకు వస్తా అని రేవంత్ రెడ్డి అన్నారు. పదేళ్లు కేసీఆర్ కు అవకాశం ఇచ్చారు.. కాంగ్రెస్ కు ఒక్క అవకాశం ఇవ్వండని, పక్క గల్లీకి వెళితే కుక్క కూడా గుర్తుపట్టని పక్క పార్టీ వ్యక్తి… అజారుద్దీన్ ఎక్కడి నుంచి వచ్చారని అంటారా? అని ఆయన ప్రశ్నించారు. మోడీనీ ఎంత మంది గుర్తుపడతారో.. అజారుద్దీన్ ను అంతే మంది గుర్తుపడతారన్నారు. అలాంటి అజారుద్దీన్ ను కాంగ్రెస్ అభ్యర్థిగా నిలబెట్టిందన్నారు. అజారుద్దీన్ హైదరాబాద్ లో పుట్టి పెరిగిన వ్యక్తి అని, దేశం ఖ్యాతిని ప్రపంచానికి చాటిన వ్యక్తి అజారుద్దీన్ అని రేవంత్ రెడ్డి అన్నారు. జూబ్లీహిల్స్ లో అజారుద్దీన్ ను గెలిపించండని రేవంత్ రెడ్డి కోరారు.
Also Read : TDP Atchannaidu: ఏపీ వాలంటీర్ వ్యవస్థపై కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశాం: అచ్చెన్నాయుడు