
తెలంగాణలో ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. హుజురాబాద్, గజ్వేల్ బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ కూడా తమదైన శైలిలో ప్రచారంలో దూసుకెళ్తున్నారు. నవంబర్ 30 తర్వాత బీఆర్ఎస్కు భవిష్యత్ లేదని ధీమా వ్యక్తం చేస్తున్నారు ఈటల రాజేందర్. బీజేపీ అధికారంలోకి వస్తే బీసీని ముఖ్యమంత్రిని చేస్తామనే నినాదంతో ముందుకు సాగుతున్నారు. ఎన్నికల రణరంగంలో బిజీగా ఉన్న ఈటల రాజేందర్.. ఇప్పుడు ఎన్టీవీ ప్రత్యేక ఇంటర్వ్యూలో మాట్లాడుతున్నారు.. ఈటల రాజేందర్ ముఖ్యమంత్రి రేసులో ఉన్నారా..? బీజేపీ ఈ ఎన్నికల్లో ఎన్ని సీట్లు గెలవబోతుంది..? బీఆర్ఎస్, కాంగ్రెస్ ల గురించి ఆయన ఏం చెప్పబోతున్నారు.. ఎన్టీవీ ప్రతినిధులు సంధిస్తోన్న ప్రశ్నలకు.. ఈటల రాజేందర్ ఇస్తోన్న సమాధానాలను లైవ్‌లో చూసేందుకు కింది వీడియో లింక్‌ను క్లిక్ చేయండి..