
రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో మంత్రి కేటీఆర్ రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. మీరు దీవిస్తే ఎమ్మెల్యే అయ్యాను, కెసిఆర్ ఆశీర్వదిస్తే మంత్రిని అయ్యానన్నారు. తెలంగాణలో సిరిసిల్ల నియోజకవర్గం నంబర్ వన్ గా చేశానని, అప్పుడు ముస్తాబాద్ ఎలా ఉండే ఇప్పుడు ముస్తాబాద్ ఎలా ఉంది ఆలోచన చేయండన్నారు మంత్రి కేటీఆర్. కాంగ్రెస్ దరిద్ర పాలన కవలాన 24 కరెంటు కావాలా అని ఆయన అన్నారు. కాంగ్రెస్ కు బంపర్ ఆఫర్ ఇస్తున్న ముస్తాబాద్ రండి ఎప్పుడు వస్తారో చెప్పండి అని ఆయన సవాల్ విసిరారు. నేను బస్ ఆరంజ్ చేస్తా వచ్చి మండలంలో కరెంటు వైర్లు పట్టుకొని చూడండి కరెంటు ఉందో లేదో అంటూ మంత్రి కేటీఆర్ ఎద్దేవా చేశారు. 9 ఏళ్ళుగా సిరిసిల్ల లో ఎంత అభివృద్ధి జరిగిందో చూడండని ఆయన వ్యాఖ్యానించారు.
RK Roja: మాజీ మంత్రి బండారుపై రోజా పరువు నష్టం దావా
కేసీఆర్ గెలవగానే 5 పథకాలు అమలు చేస్తామని, కొడల్ల కోసం, 18 సంవత్సరాలు నిండిన మహిళలకు కొత్త పథకం సౌభాగ్య లక్ష్మి పేరు మీద నెలకు 3000 వేలు ఇస్తామన్నారు మంత్రి కేటీఆర్. రానున్న రోజుల్లో కొత్త రేషన్ కార్డులు, పించన్లు ఇచ్చే బాధ్యత నాదే అని మంత్రి కేటీఆర్ హామీ ఇచ్చారు. తెల్ల రేషన్ కార్డులు ఉన్నవారికి 400లకే సిలిండర్, సన్న బియ్యం ఇస్తామని, తెల్ల రేషన్ కార్డు ఉన్న వారికి కెసిఆర్ ధీమా పేరు మీద 5 లక్షల భీమా ఇస్తామన్నారు మంత్రి కేటీఆర్. జనవరిలో ముస్తాబాద్ లో డిగ్రీ కళాశాల ఏర్పాటు చేస్తామని, మీరు ఓటు వేస్తే నేను ఎమ్మెల్యే అయ్యాను. మీరు గౌరవంగా తల ఎత్తుకునేల పని చేశానన్నారు. మీకోసం పని చేస్తున్న, నన్ను మల్లొకసారి ఆశీర్వదించండని, కళ్ళ ముందు ఉన్న అభివృద్దినీ చూసి ఓటు వేయండి, సోషల్ మీడియాలో వచ్చేది నమ్మకండన్నారు. కాంగ్రెస్ చాలా మాటలు చెపుతుంది వారి మాటలు నమ్మకండని, ఎలక్షన్ రాగానే వాళ్ళు వీళ్ళు చెప్పేది నమ్మొద్దన్నారు. మస్పూర్తిగా ఆలోచన చేసి నాకు ఓటు వేయండని, కేసీఆర్ కు తెలంగాణ మీద ప్రేమ ఉన్నట్టు రాహుల్ గాంధీ, మోడీ కి ఉంటాదా అని ఆయన అన్నారు.
Sudigali Sudheer: బాధలో ఉన్నోడికి భయం ఉండదు.. అదిరిపోయిన కాలింగ్ సహస్ర ట్రైలర్