Leading News Portal in Telugu

Revanth Reddy: నేడు నాలుగు నియోజకవర్గాల్లో రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారం..



Revanth Reddy

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియ కీలక ఘట్టానికి చేరుకుంది. ప్రచారానికి మరో నాలుగు రోజుల సమయం ఉండటంతో ఇప్పటికే అన్ని పార్టీలు ప్రచారంలో స్పీడ్ పెంచాయి. దీంతో ఇవాళ టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తెలంగాణలోని నాలుగు నియోజకవర్గాల్లో ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. కాంగ్రెస్ విజయభేరి బహిరంగ సభలు నిర్వహిస్తూ ప్రజలను ప్రసన్నం చేసుకునే పనిలో ఆయన పడ్డారు. ఈ క్రమంలో రేవంత్ మాట్లాడుతూ.. బీఆర్ఎస్ సర్కార్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. ఇక, సీఎం కేసీఆర్ పాలనలో రైతులు తీవ్రంగా నష్టపోయారని ఆయన ప్రజలకు తెలియజేస్తున్నారు. రైతులకు సాయం చేయాలంటే పంటలకు, విత్తనాలకు బీమా పథకం తీసుకురావాలన్నారు. అలా జరగాలంటే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని ఓటర్లకు రేవంత్ రెడ్డి సూచిస్తున్నారు.

Read Also: G20 Summit: నేడు వర్చువల్ జి20 సదస్సు.. అధ్యక్షత వహించనున్న ప్రధాని మోడీ

ఇక, ఎన్నికల ప్రచారంలో భాగంగా నేడు రేవంత్ రెడ్డి 4 నియోజకవర్గాల్లో పర్యటించబోతున్నారు. ఈరోజు సంగారెడ్డి, సిద్దిపేట జిల్లాలో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. అలాగే, నారాయణఖేడ్, గజ్వేల్ నియోజకవర్గాల్లో జరిగే బహిరంగ సభలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పాల్గొననున్నారు. అలాగే, సాయంత్రం 4.30 గంటలకు హైదరాబాద్ పరిధిలోని కూకట్‌పల్లిలో రోడ్‌ షోలో పాల్గొంటారు.. ఇక, 6 గంటలకు శేరిలింగంపల్లిలో రోడ్‌ షోలో రేవంత్ రెడ్డి ప్రసంగిస్తారు.