Leading News Portal in Telugu

Purumalla Srinivas: కరీంనగర్‌లో కాంగ్రెస్ అభ్యర్థి పురుమల్ల శ్రీనివాస్ విస్తృత ప్రచారం



Purumalla

కరీంనగర్‌లో కాంగ్రెస్ అభ్యర్థి పురుమల్ల శ్రీనివాస్ విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. బుధవారం కరీంనగర్‌లో 59వ వార్డులో పర్యటించిన ఆయన బడుగు బలహీన వర్గాలకు అందుబాటులో ఉండి సేవ చేసేందుకు అవకాశం ఇవ్వాలని నియోజకవర్గ ప్రజలకు పిలుపునిచ్చారు. దేశంలోని పెద్దపెద్ద సర్వేలు తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేది కాంగ్రెస్ అని చెప్తున్నాయన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన 6 గ్యారంటీ కార్డులో అభ్యర్థి సంతకం పార్టీ ప్రెసిడెంట్ సంతకాలు ఉంటాయని తెలిపారు. గ్యారెంటీ కార్డు అనేది అప్పు పత్రం లాంటిదని, రేపు ఎలాంటి తప్పిదం జరిగిన గల్ల పట్టి అడిగే హక్కు ప్రజలకు ఉంటుందన్నారు. అనంతరం కరీంనగర్ లో పోటీ చేస్తున్న బీజేపీ, టిఆర్ఎస్ అభ్యర్థులు ఇద్దరూ దొంగలేనన్నారు. కరీంనగర్‌లో ఒకరికి మూడుసార్లు.. మరోకరికి ఒకసారే అవకాశం ఇచ్చారని.. ఈ ఒక్కసారి తనకు అవకాశం ఇవ్వాలని పురుమల్ల శ్రీనివాస్ విజ్ఞప్తి చేశారు.