
CM Siddaramaiah: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి ఇంకా మూడు రోజుల సమయం మాత్రమే ఉంది. దీంతో కాంగ్రెస్ అగ్రనేతలు రాష్ట్రంలో ఆ పార్టీ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం నిర్వహిస్తున్నారు. కాగా రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే, కర్ణాటక ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్ ఇప్పటికే రాష్ట్రంలో స్థిరపడి ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇవాళ కర్ణాటక, ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రులు తెలంగాణకు వచ్చారు. ఈ క్రమంలో హైదరాబాద్‌లోని తాజ్‌కృష్ణా హోటల్‌లో కర్ణాటక సీఎం సిద్ధరామయ్య మీడియా సమావేశంలో మాట్లాడారు. కర్ణాటకలో ఎన్నికల హామీలను అమలు పరుచడం లేదని అంటున్నారు. 5 హామీలను నెరవేర్చడం లేదని న్యూస్ పేపర్స్, టీవీ ఛానెల్స్ లో చూశాను. కేసీఆర్, అతని కొడుకు, బీజేపీ నేతలు మాపై ఆరోపణలు చేస్తున్నారు. మా తొలి కేబినెట్ లోనే 5 హామీలపై సంతకం చేశామన్నారు.
Read Also:Ashika Ranganath: ఈ అమ్మాయి బాగుంది కానీ ఆఫర్స్ అంతంత మాత్రమే…
5 హామీల్లో శక్తి యోజనే పథకాన్ని ముందుగా ప్రారంభించామని కర్ణాటక సీఎం సిద్ధరామయ్య అన్నారు. రోజూ దాదాపు 61 నుంచి 62 లక్షల మంది మహిళలు రోజు ఉచితంగా ప్రయాణిస్తున్నారన్నారు. మీరు కావాలంటే వెరిఫై చేసుకోవచ్చంటూ సవాల్ చేస్తున్నారు. తన భార్య కూడా బస్సులోనే ప్రయాణిస్తుందన్నారు.అన్న భాగ్య సిద్ధి ప్రతి ఒకరికి పది కిలోల ఉచిత బియ్యం ఇస్తున్నాం. దీనికి 4కోట్ల 37 లక్షల మంది బెనిఫిషియర్స్ ఉన్నారని తెలిపారు. జులై నుంచి గృహ జ్యోతి కింద 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇస్తున్నామన్నారు. గృహ లక్ష్మి కింద కోటి డెబ్బై లక్షల మంది రిజిస్టర్ అయ్యారని.. ఇంట్లోని మహిళా యజమానికి ప్రతి రోజు రెండు వేల రూపాయలు అందిస్తున్నామన్నారు.
గృహ లక్ష్మీ కింద ఇంకా రిజిస్ట్రేషన్స్ కొనసాగుతున్నాయని తెలిపారు. యువనిధి కింద డిగ్రీ పాసైన నిరుద్యోగ యువతకు మూడు వేలు, 1500 రూపాయలు డిప్లొమా చదివిన వాళ్లకి నిరుద్యోగ భృతి ప్రకటించామన్నారు. జనవరిలో యువనిధి పథకం ప్రారంభిస్తున్నామన్నారు. మేము ప్రకటించిన ఐదు గ్యారంటీలను అమలు చేశామన్నారు. ఐదు గ్యారెంటీలతో పాటు 165 పథకాలను మేనిఫెస్టోలో పెట్టాం. 158 పథకాలను స్టార్ట్ చేసి అమలు చేస్తున్నమన్నారు. 600 పథకాలను చేస్తామని చెప్పిన బీజేపీ 10శాతం కూడా చేయలేదు. కేసీఆర్ కు అనుమానం ఉంటే కర్ణాటకకు రండి.. చూపిస్తామన్నారు. గత ప్రభుత్వం చేపట్టిన పనులు నడుస్తున్నాయి.. మా కొత్త పథకాలు నడుస్తున్నాయి. కర్ణాటక స్టేట్ ఆర్థికంగా బలంగా ఉంది.. మా రాష్ట్ర బడ్జెట్ చాలా పెద్దదన్నారు.
Read Also:Arvind Kejriwal: ఫస్ట్ టైం తనతో లేనందుకు బాధపడ్డ అరవింద్ కేజ్రివాల్
తెలంగాణలో వంద శాతం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. తెలంగాణలో ఆరు గ్యారెంటీలను అమలు చేస్తామని భరోసా ఇచ్చారు. బీజేపీ, బీఆర్ఎస్ నేతలు కర్ణాటకకు రండి.. మిమ్మల్ని మా అతిథుల్లా ట్రీట్ చేసి ఎవిడెన్స్ లతో సహా చూపిస్తామన్నారు. తెలంగాణ ప్రజలను బీఆర్ఎస్, బీజేపీలు పక్క దారి పట్టిస్తున్నాయన్నారు.