
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ వెంకటరెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓట్లు చీల్చి బీఆర్ఎస్ ను గెలిపించేలా బీజేపీ ప్రయత్నిస్తోందని విమర్శించారు. పోలింగ్ కు రెండు రోజుల ముందు రైతుబంధుకు ఈసీ అనుమతి ఇవ్వడంతో బీజేపీ, బీఆర్ఎస్ కలిసిపోయాయని అర్థమవుతోందని ఆరోపించారు. బీఆర్ఎస్ పట్ల ప్రజలు అసంతృప్తితో ఉన్నారని.. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ కు అవకాశం ఇద్దామని ప్రజలు అనుకుంటున్నారని చాడ వెంకటరెడ్డి తెలిపారు
రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజలను కలిసిన సందర్భాలు లేవని చాడ వెంకటరెడ్డి ఆరోపించారు. తెలంగాణ కోసం కేసీఆర్ సోప్టాప్ కొట్లాటే కొట్లాడాడు, సకల జనుల పోరాటంతోనే తెలంగాణ వచ్చిందని తెలిపారు. బీఆర్ఎస్ ను ఓడించడమంటే బీజేపీని ఓడించడమేనని.. ఓడిపోతామనే భయంతో బీజేపీ మంత్రులంతా రాష్ట్రానికి వరుస పెడుతున్నారని పేర్కొన్నారు. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణను ప్రజల తెలంగాణగా మార్చుకోవాలని.. ప్రజాస్వామ్యం బ్రతకాలంటే కాంగ్రెస్ ను గెలిపించాలని చాడ వెంకటరెడ్డి కోరారు.