Leading News Portal in Telugu

PM Modi Tour: నేడు తెలంగాణలో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచారం


PM Modi Tour: నేడు తెలంగాణలో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచారం

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ప్రధాని నరేంద్ర మోడీ ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. ఉదయం 10.25 గంటలకు తిరుపతి విమానాశ్రయం నుంచి బయలుదేరి 11 గంటలకు హకీంపేట్‌కు ఆయన చేరుకోనున్నారు. ఇక, హకీంపేట్ నుంచి మోడీ మహబూబ్‌నగర్‌ చేరుకోనున్నారు. అక్కడ మధ్యాహ్నం దాదాపు 40 నిమిషాల పాటు బీజేపీ నిర్వహిస్తున్న సకల జనుల విజయ సంకల్ప బహిరంగ సభలో పాల్గొంటారు. ఇక, మధ్యాహ్నం 12 గంటలకు మహబూబ్‌నగర్‌ నుంచి బయలుదేరి మోడీ కరీంనగర్ చేరుకోనున్నారు.

ఇక, మధ్యాహ్నం కరీంనగర్‌ లో బీజేపీ నిర్వహించే విజయ సంకల్ప సభ ప్రధాని మోడీ పాల్గొంటారు. కరీంనగర్ సభ తర్వాత సాయంత్రం 4 గంటలకు హైదరాబాద్‌లోని ఆర్టీసీ క్రాస్‌ రోడ్‌ నుంచి కాచిగూడ చౌరస్తా వరకు 2 కిలోమీటర్ల రోడ్ షోలో మోడీ ఎన్నికల ప్రచారం చేస్తూ ముందుకు కొనసాగుతారు. రోడ్ షా అనంతరం గురుపౌర్ణమి సందర్భంగా అమీర్ పేట్ లోని గురుద్వారాలో ఆయన ప్రత్యేక పూజలు చేయనున్నారు. ఆ తర్వాత సాయంత్రం 6 గంటలకు ఎన్టీఆర్‌ స్టేడియంలో ఎన్టీవీ- భక్తిటీవీ, వనిత టీవీ సంయుక్తంగా కలిసి నిర్వహిస్తున్న కోటి దీపోత్సవం కార్యక్రమంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పాల్గొననున్నారు.