Leading News Portal in Telugu

Minister KTR: కేటీఆర్ రోడ్ షో షెడ్యూల్.. ఇవాళ ఎక్కడంటే..


Minister KTR: కేటీఆర్ రోడ్ షో షెడ్యూల్.. ఇవాళ ఎక్కడంటే..

Minister KTR: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి మరో ఒక్క రోజు సమయం ఉంది. దీంతో ప్రధాన పార్టీలు ముమ్మరంగా ప్రచారం నిర్వహిస్తున్నాయి. ఇందులో అధికార బీఆర్ఎస్ పార్టీ ఇంకాస్త ముందంజలో ఉంది. ఇక, గులాబీ బాస్, సీఎం కేసీఆర్ రోజుకు నాలుగు నియోజకవర్గాల చొప్పు సుడిగాలి పర్యటనలు చేస్తున్నాండటంతో ప్రతిపక్ష పార్టీలు సైతం తమ పార్టీ అగ్రనేతలను రంగంలోకి దించి ప్రచారం చేయిస్తున్నాయి. ఇవాళ ముషీరాబాద్ నియోజకవర్గంలో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ రోడ్‌షో నిర్వహించనున్నట్లు ఆ పార్టీ నియోజకవర్గ ఎన్నికల ప్రచార కార్యదర్శులు వి.సుధాకరగుప్త, ముచకుర్తి ప్రభాకర్, వివేక్ ఒక ప్రకటనలో తెలిపారు.

ముషీరాబాద్‌ నియోజకవర్గ బీఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థి ముఠా గోపాల్‌కు మద్దతుగా రోడ్‌షో నిర్వహించి, వీధి సభల్లో ప్రసంగిస్తామన్నారు. ఉదయం 9 గంటలకు ఆటోయూనియన్‌ మీటింగ్‌, ఉదయం 10 గంటలకు పెద్దపల్లిలోని సుల్తానాబాద్‌ రోడ్‌ షో, ఉదయం 11.30 గంటలకు ధర్మపురి వెల్గటూర్‌ లో రోడ్ షో, ఉదయం 12.30 గంటలకు చెన్నూర్‌ లో రోడ్‌ షో, ఉదయం 1.30 గంటలకు హుజూరాబాద్‌ లో రోడ్‌ షో అనంతరం ములుగు జిల్లా ఏటూరు నాగారంలో కేటీఆర్ రోడ్డు షో నిర్వహించనున్నట్లు సమాచారం. మధ్యాహ్నం 2 గంటలకు హెలిాప్టర్లలో ఏటూరు నాగరం చేరుకుని రోడ్ షో లో కేటీఆర్ పాల్గొననున్నారు. ములుగు నియోజకవర్గ అభ్యర్థి బడే నాగజ్యోతికి మద్దతుగా ప్రచారం నిర్వహిస్తారు.

Read also: PM Modi Tour: నేడు తెలంగాణలో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచారం

అనంతరం అక్కడి నుంచి మళ్లీ నగరానికి చేరుకుని సాయంత్రం 6 గంటలకు అంబర్‌ పేట్‌ లో రోడ్‌ షో నిర్వహించనున్నారు. ఆలీ కేఫ్‌, ఫీవర్‌ ఆసుపత్రి, చప్పల్‌ బజార్‌ రోడ్‌ షో నిర్వహిస్తారు. రాత్రి 8 గంటలకు ముషీరాబాద్‌ లో రోడ్‌ షో లో నిర్వహించనున్నారు. రాంనగర్‌ ఎక్స్‌ రోడ్‌, భోలక్‌ పూర్‌, గాంధీ నగర్‌ న్యూ బ్రిడ్జ్‌ వరకు కేటీఆర్‌ రోడ్‌ షో లో చేపట్టనున్నారు. అంబర్‌పేట నియోజకవర్గంలో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ రోడ్ షో నిర్వహిస్తున్నట్లు బీఆర్‌ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ తెలిపారు. సాయంత్రం 5 గంటలకు అంబర్ పేట డివిజన్ నల్లకుంట ఫీవర్ హాస్పిటల్ చౌరస్తాలో అలికేఫ్ చౌరస్తాలో కేటీఆర్ రోడ్ షో నిర్వహించనున్నారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని రోడ్‌షోను విజయవంతం చేయాలని కోరారు.
Rajamouli: ఎంత ధైర్యం… జక్కన్నపైనే జోకులా