Leading News Portal in Telugu

Karthika Pournami 2023: కార్తిక పౌర్ణమి.. శైవక్షేత్రాలు భక్తులతో కిటకిట


Karthika Pournami 2023: కార్తిక పౌర్ణమి.. శైవక్షేత్రాలు భక్తులతో కిటకిట

Karthika Pournami 2023: కార్తిక పౌర్ణమిని అత్యంత ముఖ్యమైన, పవిత్రమైన రోజుల్లో ఒకటిగా భావిస్తారు భక్తులు.. ఈ రోజున నదుల్లో పుణ్యస్నానాలు ఆచరించి, దీపాలు వెలిగిస్తుంటారు.. సూర్యోదయానికి ముందే దీపాధారదన చేస్తారు.. ముఖ్యమంత్రి శైవ క్షేత్రాలకు భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది.. ప్రముఖ శైవక్షేత్రం శ్రీశైలం కార్తీక రెండవ సోమవారం, పౌర్ణమి కావడంతో మల్లన్న ఆలయానికి భక్తులు పోటెత్తారు. మధ్యాహ్నం వరకు పౌర్ణమి ఉండటంతో పాతాళగంగలో పుణ్యస్నానాలను ఆచరిస్తున్నారు భక్తజనం … గంగాధర మండపం, ఉత్తర శివమాడ వీధిలో కార్తీక దీపాలను వెలిగిస్తున్నారు. భక్తుల రద్దీ దృష్ట్యా భక్తులందరికీ స్వామివారి అలంకార దర్శనానికి అనుమతి ఇస్తున్నారు. క్యూలైన్లో వేలాదిమంది భక్తులు వేచిఉండగా.. మల్లన్న దర్శనానికి సుమారు 4 గంటల సమయం పడుతున్నట్టు అధికారులు చెబుతున్నారు.. మొత్తంగా శివనమస్మరణతో ముక్కంటీ క్షేత్రం మార్మోగుతోంది..

ఇక, శ్రీశైలంతో పాటు ఈ రోజు తెల్లవారుజామున నుంచే భక్తులు తెలుగు రాష్ట్రాల్లోని ఇతర ఆలయాల్లో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాన్నారు. భక్తిశ్రద్దలతో దీపాలు వెలిగిస్తున్నారు. వరంగల్‌ భద్రకాళి, అన్నవరం, ద్వారకతిరుమల, భద్రాచలం సహా చిన్నా పెద్ద ఆలయాలు అనే తేడా లేకుండా అన్ని ఆలయాల దగ్గర రద్దీ కనిపిస్తోంది.. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని శివాలయాలన్నీ శివనామస్మరణతో మారుమొగుతున్నాయి. హన్మకొండలోని వెయ్యి స్తంభాల గుడి, సిద్దేశ్వరా స్వామి దేవాలయం, భద్రకాళి భద్రశ్వరా స్వామి దేవాలయాల్లో తెల్లవారు జామునుంచి భక్తులు బారులు తీరారు. కాళేశ్వరం, రామప్ప, పాలకుర్తి సోమేశ్వర స్వామి దేవాలయం, కురవి వీరబాదరస్వామి, ఐనవోలు మల్లికార్జున స్వామి, కొమురవెళ్లి మల్లన్న ఆలయాల్లో కార్తికపౌర్ణమి శోభ సంతరించుకుంది. శివాలయాల్లో ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహిస్తున్నారు. శివనామస్మరణతో శైవ క్షేత్రాలు మారుమోగుతున్నాయి.

ఇక, కార్తిక పౌర్ణమి, రెండో సోమవారం పర్వదిన సందర్భంగా రాజమండ్రి గోదావరి ఘాట్ల వద్ద తెల్లవారుజాము నుంచి భక్తులు పుణ్య స్నానాలు ఆచరిస్తున్నారు. శివనామ స్మరణతో శైవాలయాలు మారుమోగుతున్నాయి. రాజమండ్రిలో మార్కండేయ స్వామి ఆలయం, ఉమా రామలింగేశ్వర స్వామి ఆలయాలతో పాటు పంచారామ క్షేత్రమైన ద్రాక్షారామం, అంబేద్కర్ కౌన్సిలింగ్ జిల్లాలోని కోటిపల్లి మురమళ్ళ ముక్తేశ్వరం లోని క్షణముక్తేశ్వర స్వామి ఆలయాలకు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు భక్తులు.