
Manda Krishna Madiga: యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. సామాజిక న్యాయ సూత్రానికి కాంగ్రెస్ వ్యతిరేకమని ఆరోపించారు. కాంగ్రెస్ హయాంలో వర్గీకరణ జరుగుతుందని ఎదురు చూసామని తెలిపారు. కమిషన్ వేసిన పార్టీనే… ఆ కమిషన్ నివేదికను బుట్టదాఖలు చేసింది కూడా కాంగ్రెస్సే అని అన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ స్వయంగా విస్పష్ట ప్రకటన చేయడం మంచి పరిణామమని మంద కృష్ణ పేర్కొన్నారు.
వర్గీకరణ ప్రక్రియ వేగవంతం చేసేందుకు కేంద్రం చర్యలు తీసుకుంటుందని మందకృష్ణ మాదిగ తెలిపారు. అందుకే బీజేపీ పార్టీకి మద్దతు ఇవ్వడం తమ ధర్మం అని చెప్పారు. సామాజిక న్యాయం కోసం కట్టుబడి ఉన్న పార్టీ బీజేపీ, ప్రధాని నరేంద్ర మోడీ అని అన్నారు. వర్గీకరణ వల్ల ఎవరికో నష్టం జరగాలని తాము కోరుకోవడంలేదని.. పదవుల విషయంలో కేసీఆర్ ప్రభుత్వంలో ఎస్సీ, బీసీలకు అన్యాయం జరిగిందని ఆరోపించారు. కేసీఆర్ దొరలకు పెద్దపీట వేశారని దుయ్యబట్టారు. బీసీ సీఎం అవకాశం తెలంగాణ ప్రజలు చేజార్చుకోవద్దని మంద కృష్ణ మాదిగ సూచించారు.