Leading News Portal in Telugu

MLC Kavitha: బాండ్‌ పేపర్‌ పేరుతో కొత్త డ్రామా.. కాంగ్రెస్ పై కవిత విమర్శ


MLC Kavitha: బాండ్‌ పేపర్‌ పేరుతో కొత్త డ్రామా.. కాంగ్రెస్ పై కవిత విమర్శ

MLC Kavitha: కాంగ్రెస్‌ సీనియర్‌ నేతలు బాండ్‌ పేపర్‌ పేరుతో కొత్త డ్రామాకు తెరలేపారని బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవిత విమర్శించారు. కాంగ్రెస్ మొసలి కన్నీరు నమ్మితే ప్రజలకు కన్నీళ్లు మిగలవని ఎమ్మెల్సీ కవిత అన్నారు.137 ఏళ్ల చరిత్ర ఉన్న పార్టీ ఈ స్థాయికి దిగజారిపోయిందని మండిపడ్డారు. జీవన్ రెడ్డి, సుదర్శన్ రెడ్డి, భట్టివిక్రమార్క్ లాంటి పెద్ద నాయకులు కూడా బాండ్ పేపర్లు రాసుకోవాల్సిన పరిస్థితి వచ్చిందంటే ప్రజల్లో ఆ పార్టీ ఎంతటి నమ్మకం కోల్పోయిందో అర్థం చేసుకోవచ్చు. నిజామాబాద్‌లో పార్టీ నేతలతో కలిసి ఎమ్మెల్సీ కవిత మీడియాతో మాట్లాడారు. కర్ణాటక ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ ఇలాంటి డ్రామానే చేసిందన్నారు. 223 స్థానాల్లో పోటీ చేస్తున్న ఆ పార్టీ అభ్యర్థులు వాగ్దానాలు అమలు చేస్తామని బాండ్ పేపర్లు రాసి ఇచ్చినా ఒక్కటి కూడా పూర్తిగా అమలు చేయలేకపోయారన్నారు.

కర్నాటకలో మహిళలకు రూ.2వేలు పింఛన్, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ వంటి హామీలు ప్రారంభం కాలేదన్నారు. యువనిధి కింది మొత్తం పంపిణీ చేయకుండా బియ్యం పథకానికి అడ్డుతగులుతుందని విమర్శించారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అంటూ మాట్లాడి బస్సుల సంఖ్యను గణనీయంగా తగ్గించారన్నారు. రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీపై ప్రతిపక్షాలు అసత్య ప్రచారం చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ విడుదల చేసిన గణాంకాల ప్రకారం హర్యానాలో బీజేపీ మొదటి స్థానంలో ఉండగా, కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాజస్థాన్ రెండో స్థానంలో ఉంది. మధ్యప్రదేశ్‌లో గత ఐదేళ్లలో కాంగ్రెస్, బీజేపీలు కేవలం 21 ఉద్యోగాలు మాత్రమే ఇచ్చాయి.

Read also: Virat Kohli Injury: ముఖం మొత్తం కమిలింది.. విరాట్ కోహ్లీకి ఏమైంది?

కానీ, తెలంగాణలోని బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం గత పదేళ్లలో 2.30 లక్షల ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ ఇచ్చిందన్నారు. వీటిలో ఇప్పటికే 1.30 లక్షల ఉద్యోగాలు భర్తీ అయ్యాయి. ప్రైవేట్ రంగంలో 30 లక్షలకు పైగా ఉద్యోగాలు సృష్టించబడ్డాయి. రాష్ట్రంలో కొత్తగా 10 లక్షల ఐటీ ఉద్యోగాలు వచ్చాయన్నారు. కాంగ్రెస్ నేతల నిరుద్యోగ సభలే ఆ పార్టీ రాజకీయ నిరుద్యోగానికి నిదర్శనమన్నారు. వారి మొసలి కన్నీళ్లు నమ్మితే ప్రజల కన్నీళ్లు తప్పవని అన్నారు. రాష్ట్రాన్ని 55 ఏళ్లు పాలించిన కాంగ్రెస్ 6 గంటల కరెంట్ ఇచ్చిందని, వ్యవసాయం, పరిశ్రమలు, ఇళ్లకు 24 గంటల కరెంట్ ఇస్తున్నామన్నారు. తెలంగాణలో ప్రాజెక్టులు కట్టేందుకు కాంగ్రెస్ నేతలు అంగీకరించడం లేదన్నారు.

గతంలో వెయ్యి గ్రామాల్లో ఫ్లోరైడ్ సమస్య ఉండేదని, ఇప్పుడు ఒక్క గ్రామంలో కూడా ఫ్లోరైడ్ లేదన్నారు. నేడు ప్రభుత్వ దవాఖానల్లో 65 వేల పడకలు ఏర్పాటు చేశామని, ప్రభుత్వాసుపత్రుల్లో ప్రసవాలు పెరిగాయన్నారు. 55 ఏళ్ల కాంగ్రెస్ హయాంలో 6700 కిలోమీటర్ల రోడ్లు నిర్మిస్తే బీఆర్ ఎస్ ప్రభుత్వం తొమ్మిదిన్నరేళ్లలో 13 వేల కిలోమీటర్ల రోడ్లు నిర్మించిందన్నారు. రెండు రౌండ్లలోనూ చాలా మెరుగయ్యానని, మళ్లీ గెలిస్తే మరింత మెరుగుపడతానని చెప్పాడు. రేషన్ కార్డు సమస్యను పరిష్కరించి ప్రతి ఒక్కరికీ రూ.5 లక్షల బీమా కల్పిస్తామన్నారు. గల్ఫ్ కార్మికులను ఆదుకునేందుకు కొత్త పాలసీని ప్రకటించనున్నట్లు తెలిపారు. మహిళలకు సౌభాగ్యలక్ష్మి పేరిట రూ.3వేలు అందజేస్తామన్నారు.
Uttarakhand : ఇంకా ఆరు మీటర్లే మిగిలుంది.. మరికొన్ని గంటల్లో బయటకు రానున్న కార్మికులు